ప‌క్కా ఆధారాల‌తో అరెస్టైయిన దీప‌క్‌రెడ్డి క‌బ్లాలు ఎలా చేశాడంటే..

Spread the love

ప‌క్కా ఆధారాల‌తో అరెస్టైయిన దీప‌క్‌రెడ్డి క‌బ్లాలు ఎలా చేశాడంటే

దీపక్ రెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన జేసీ సోదరులకు మేనల్లుడు. కాగా, హైదరాబాదులో ఆరు ప్రాంతాల్లో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలతో భూకబ్జా ఆరోపణలతో ఆయనను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు.శాస్త్రీయ ఆధారాలతో దీపక్ రెడ్డిని అరెస్టు చేశారు. అతను చనిపోయిన వ్యక్తుల పేరుతో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడని తేలింది. నకిలీ పత్రాలు సృష్టించి, నకిలీ వ్యక్తులతో రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఆ తర్వాత కోర్టులో పిటిషన్ వేసి, బెదిరింపులకు పాల్పడేవాడు…దీపక్ రెడ్డీ మోసాల పై ఫోకస్

హైదరాబాద్ లో దశాబ్దాల క్రితం నివాసమున్న అయూబ్ కమల్ అనే శరణార్థికి చెందిన బంజారాహిల్స్ లోని 3.37 ఎకరాల భూమిని, 1960లో ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేశారు. అయితే, 2008లో ఆ భూమిని అక్బర్ మొహినుద్దీన్ అన్సారీ, ఖాజా మొహినుద్దీన్ అన్సారీ అనే వ్యక్తులు కొనుగోలు చేశారని దీపక్ రెడ్డి తరపు న్యాయవాది శైలేష్ సక్సేనా తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఆ భూమిని వారి నుంచి దీపక్ రెడ్డి కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలను తయారు చేశారు. తమ భూమిని ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కబ్జా చేశారంటూ భూ కబ్జా నిరోధక కోర్టులో న్యాయవాది శైలేష్ ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కేసు విచారణలో ఉండగా, కొన్ని నెలల క్రితం చౌదరి తరఫు ప్రతినిధి, రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన అసలు పత్రాలను ఆ కోర్టులో సమర్పించారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చౌదరి తరపు ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. న్యాయవాది శైలేష్ సహా దీపక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
అసిఫ్ నగర్ లో మొత్తం రూ.165 కోట్ల విలువ చేసే భూములను అక్రమంగా సొంతం చేసుకునేందుకు న్యాయవాది శైలేష్ పథక రచన చేయగా, దీపక్ రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. అసిఫ్ నగర్ లో ఓ సొసైటీకి చెందిన భూమి తమదేనంటూ సుమారు ఏడేళ్ల క్రితం శైలేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, ప్రభుత్వానికి చెందిన వంద ఎకరాల భూమిని నిజాం నవాబ్ తమకు ఇనాంగా ఇచ్చారంటూ కోర్టుకు కొన్ని పత్రాలను శైలేష్ సమర్పించారు. ఈ క్రమంలో సొసైటీ సభ్యులు అసలు పత్రాలను న్యాయస్థానానికి సమర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ భూములు శైలేష్ వి కావని పోలీసుల ప్రాథమిక ఆధారాల్లో తేలింది. శైలేష్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన పారిపోయాడు. ఈ నేపథ్యంలో శైలేష్ ను సొసైటీ సభ్యులు అపహరించారంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో దీపక్ రెడ్డి గతంలో ఫిర్యాదు చేయడం, ఆ విషయం అవాస్తవమని పోలీసుల విచారణలో తేలడం జరిగింది. చౌదరి బ్రదర్స్ ఇంటికి వెళ్లి వారిని బెదిరించడం, పోలీసుల విచారణలో దురుసుగా వ్యవహరించడం వంటి కేసులు దీపక్ రెడ్డి పై గతంలో నమోదయ్యాయి.

దీపక్ రెడ్డికి న్యాయవాది శైలేంద్ర సక్సేనా సహకరించేవాడు. శ్రీనివాస రావు అనే మరో వ్యక్తి కూడా సహాయం చేశాడు. దీపక్ ముఠాపై సిసిఎస్ పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయి. బోజగుట్టలో రూ.300 కోట్లు, బంజారాహిల్స్‌లో రూ.1,065 కోట్లు భూకబ్జాలకు పాల్పడ్డారు.
ఆసిఫ్‌నగర్‌లలో రూ.165 కోట్ల విలువైన భూములను న్యాయవాది శైలేష్‌ సక్సేనా సాయంతో కబ్జా చేసేందుకు యత్నించారని ఆధారాలు లభించడంతో ఇద్దరినీ జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. దీపక్ రెడ్డి ముందస్తు బెయిలు గడువు పూర్తి కావడం, సక్సేనా బెయిలు పటిషన్‌ తిరస్కరణకు గురవడంతో ఇద్దరినీ అరెస్టు చేశామని డీసీపీ అవినాశ్‌ మొహంతీ తెలిపారు. దీపక్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ఏపీ శాసనమండలి ఛైర్మన్‌కు అధికారిక సమాచారం ఇచ్చామని వివరించారు. నకిలీ పత్రాలు సృష్టించడంలో వీరికి సహకరించిన ఆర్‌ శ్రీనివాస్‌ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారుఈ వ్యవహారంలో దురుసుగా ప్రవర్తించిన దీపక్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్‌ భూమి కేసులో సీసీఎస్‌ పోలీసుల విచారణకు హాజరైనప్పుడు సీసీఎస్‌ వెలుపల దురుసుగా ప్రవర్తించాడంటూ సైఫాబాద్‌ ఠాణాలో దీపక్ రెడ్డిపై కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ భూమి సొంతదారు చౌదరి ఇంటికి వెళ్లి బెదిరించినందుకు మాదాపూర్‌ పోలీస్ స్టేషన్లోను కేసు నమోదైంది. తనపై భూకబ్జా కేసు పెట్టిన అంశంపై టిడిపి ఏపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పందించారు. ఆయనను బుధవారం కోర్టులో హాజరుపరిచిన అనంతరం, చంచల్ గూడ జైలుకు తరలించే సమయంలో మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు కేసు బనాయించారని దీపక్ రెడ్డి అన్నారు. కాగితాలపై తన సంతకం లేదని చెప్పారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే తన సంతకమా కాదా అనేది తేలుతుందని చెప్పారు. కనీసం అది చెక్ చేయకుండా కేసు పెట్టారన్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నారు. తాను త్వరలో నిజాలు అన్నింటినీ బయటపెడతానని దీపక్ రెడ్డి చెప్పారు. దయచేసి ఓపిక పట్టాలని మీడియాతో అన్నారు. కాగా, డాక్యుమెంట్లపై మీ సంతకం టాలీ అయిందని చెబుతున్నారని మీడియా ప్రశ్నించగా.. ఎవరు చెప్పారు, లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow