రూ.6 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఎమ్మార్వో

Spread the love

కాజీపేట డిప్యూటీ ఎమ్మార్వో అనిల్‌ కుమార్‌
ఏసీబీ పట్టుకున్న నగదు

కాజీపేట : అక్రమాలకు అలవాటు పడిన ఓ అవినీతి అధికారి భారీ మొత్తాన్ని లంచంగా తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా రూ.6 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి కాజీపేట డిప్యూటీ తహసీల్దార్‌ కె.అనిల్‌ కుమార్‌ పట్టుబడ్డారు. నగరంలో జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. దీనిపై హన్మకొండ టీచర్స్‌ కాలనీలోని ఫేస్‌-2లో ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సంధర్బంగా రూ.6 లక్షల నగదుతో పాటు చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఎసిబి డిఎస్పీ సుదర్సన్‌ తెలిపిన వివరాల మేరకు కాజిపేట మండల కేంద్రంలోని న్యూశాయంపేటకు చెందిన పుల్లూరి సమ్మయ్యకు 3-03 ఎకరాల భూమిని రెవెన్యూ రికార్డులలో నమోదు చేయడానికి అనిల్‌కుమార్‌ రూ.6 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో సమ్మయ్య ఎసిబి అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.దీంతో హన్మకొండ టీచర్స్‌ కాలనీలోని ఫేస్‌-2లో ఆయన ఇంట్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారన్నారు.డిటి ఇంట్లో తనిఖీలు చేసి నగదు స్వాదీనం చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు,తనిఖీల్లో ఎసిబి అధికారులలో కరీంనగర్‌ డిఎస్పి సుదర్సన్‌,వరంగల్‌ సిఐ రాఘవేందర్‌,వెంకటేష్‌,ఎస్వీ రమణమూర్తి తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow