సక్సెస్ ఫుల్ హీరో నిఖిల్ తో…ఎ.కె ఎంటర్ టైన్మెంట్ ప్రొడక్షన్ నెం.11

Spread the love

సక్సెస్ ఫుల్ హీరో నిఖిల్ తో…ఎ.కె ఎంటర్ టైన్మెంట్ ప్రొడక్షన్ నెం.11

ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ ప్రొడక్షన్ నెం.11గా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూర్చనుండడం విశేషం.

నిఖిల్ తో సుధీర్ వర్మ “స్వామి రారా, కేశవ” లాంటి సూపర్ హిట్స్ ను తెరకెక్కించగా.. చందూ మొండేటి “కార్తికేయ” లాంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చి ఉండడం విశేషం. ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుండడం.. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ లాంటి ప్రఖ్యాత సంస్థ నిర్మించనుండడం హాట్ టాపిక్ గా మారింది.
అజనీష్ లోక్నాధ్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. చిత్ర బృందం సరికొత్త టాలెంట్ ను పరిశ్రమకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో.. 8 మంది అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు రోల్స్ కోసం క్యాస్టింగ్ కాల్ ను నిర్వహించనుంది.

ఆసక్తి గల 18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్కులైన యువకులు ww.celeb-zone.com (or) mail @ apply@celeb-zone.com లో తమ ప్రొఫైల్ ను అప్డేట్ చేయడం లేదా ఈమెయిల్ చేయవచ్చు.
ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ఎనౌన్స్ చేస్తామని, వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న నిఖిల్ లాంటి యువ హీరోతో సినిమా రూపొందించడం తమకు చాలా సంతోషంగా ఉందని, నిఖిల్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథ ఇది, దీనికి చందూ మొండేటి-సుధీర్ వర్మ వంటి ప్రతిభావంతులు తొడవ్వడం చాలా ఆనందంగా ఉందని చిత్ర నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్నాధ్. మాటలు: చందూ మొండేటి, స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ, కళ: అవినాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర-అభిషేక్ అగర్వాల్, బ్యానర్: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow