8 మంది చైర్మన్లను నియమించిన తెదేపా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు

Spread the love

8 మంది చైర్మన్ల నియమించిన తెదేపా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వివిధ కార్పొరేషన్ల, వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడెమీ, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలకు చైర్మన్లను నియమించారు. వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తూ ఎనిమిది మంది చైర్మన్ల నియామకం జరిగింది. ప్రధానంగా ముస్లిం సోదరుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు, ఏపీ ఉర్దూ అకాడెమీ నియామకంలో నిర్ణయాలను వెల్లడించారు.
ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ (కృష్ణా జిల్లా)ను ఎంపిక చేయగా, ఏపీ ఉర్దూ అకాడెమీ కి డాక్టర్ ఎస్. ఎండీ. నౌమాన్ (కర్నూలు జిల్లా), స్టేట్ ఫుడ్ కమిషన్ కు జె.ఆర్. పుష్పరాజ్(గుంటూరు), ఏపీ ఫిలిం టెలివిజన్ మరియు థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అంబికా కృష్ణ(పశ్చిమ గోదావరి జిల్లా), కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)కు సోమిశెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు జిల్లా) తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడా)కు జి. నరసింహ యాదవ్(చిత్తూరు), లెథర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్ కాప్)కు జి. ఎరిక్షన్ బాబు ( (ప్రకాశం), మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు పి. ప్రకాశం నాయుడు ( అనంతపురము) లను చైర్మన్ లుగా నియమిస్తూ కార్యక్రమాల కమిటీ చైర్మన్ వి.వి.వి. చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow