జూన్ 16న అవంతిక విడుదల

Spread the love

జూన్ 16న అవంతిక విడుదల

‘అవును’ ఫేమ్‌ పూర్ణ ప్రధాన పాత్రలో శ్రీరాజ్‌ బళ్ల దర్శకత్వంలో భీమవరం టాకీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం‘అవంతిక’. హార్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకాబోతుంది.

 

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌ లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీరాజ్ బళ్ల మాట్లాడుతూ… ‘‘ఈ సినిమాలో కొంతమంది కొత్త టెక్నీషియన్స్‌ కి అవకాశం ఇస్తున్నాం. రామసత్యనారాయణ గారు నాపై నమ్మకం ఉంచి సినిమా మేకింగ్ లో నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.  ఇది హార్రర్‌ కామెడీ థ్రిల్లర్‌ మూవీ. పూర్ణ నటన ఆద్యంతం ఉత్కంఠంగా వుంటుంది. ఇతర పాత్రలు సినిమాకి ఎస్సెట్‌ అవుతాయి. నాకు సహకరించిన వారందరికి నా ధన్యవాదాలు’’ అన్నారు.

 

పూర్ణ, షాయాజీ షిండే,  శ్రీరాజ్‌ బళ్ల, గీతాంజలి, ధన్‌రాజ్‌, షకలక శంకర్‌, అజయ్‌ ఘోష్‌, సంపత్‌, మల్లిక, సత్యప్రియ, విజయకుమార్‌, సాయివెంకట్‌, రవిరాజ్‌ బళ్ల, గిరిధర్‌, ఫణిరాజ్, శివ, స్వామి నటించిన ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసాని, రమేష్, మాటలు: క్రాంతి సైనా, పాటలు: భారతీబాబు, శ్రీరామ్, మ్యూజిక్:  రవిరాజ్ బళ్ళ, రీ రికార్డింగ్:  ప్రద్యోతన్, ఎడిటింగ్: శివ వై ప్రసాద్, సోమేశ్వర్ పోచం, సతీష్ రామిడి, గ్రాఫిక్స్: చందు ఆది, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరాజ్‌ బళ్ల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow