బ్యూటీషియ‌న్ శిరీష ది…. ఆత్మ‌హ‌త్యే – పోలీసు క‌మీష‌న‌ర్ మ‌హేంద‌ర్‌రెడ్డి వెల్ల‌డి

Spread the love

బ్యూటీషియ‌న్ శిరీష ది…. ఆత్మ‌హ‌త్యే – పోలీసు క‌మీష‌న‌ర్ మ‌హేంద‌ర్‌రెడ్డి వెల్ల‌డి
బ్యూటీషియ‌న్ శిరీష అనుమాన‌స‌ప‌ద మృతి కేసు మిస్ట‌రీ వీడింది. ఇది ఆత్మహత్యేనని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్‌ కుమార్‌, శ్రావణ్‌కుమార్‌లను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన తీరుకు సంబంధించి పోలీసుల విచారణలో వెల్లడైన వివరాలను ఆయన మీడియాకు వివరించారు…పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన విజయలక్ష్మి అలియాస్‌ శిరీష హైదరాబాద్‌లో మేకప్‌ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. 13ఏళ్ల క్రితం సతీశ్‌ చంద్ర అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 12ఏళ్ల కుమార్తె ఉంది. నాలుగేళ్ల క్రితం విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్‌కుమార్‌తో కలిసి పనిచేస్తోంది. పెళ్లిళ్లకు ఫోటోలు తీయడం రాజీవ్‌ వృత్తి. అదే పెళ్లిళ్లకు శిరీష మేకప్‌ ఒప్పందాలు చేసుకునేది. ఈ క్రమంలో రాజీవ్‌, శిరీషల మధ్య స్నేహం మరింత చిగురించి.. అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ స్టుడియోలో భార్యభర్తల్లా మెలిగేవారని తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో తేజస్విని అనే అమ్మాయితో రాజీవ్‌కు పరిచయమైంది. బెంగళూరులో పనిచేస్తున్న ఆమె మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు బదిలీపై వచ్చింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా రాజీవ్‌ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన తేజస్విని నిలదీసేందుకు అతడి కార్యాలయానికి వెళ్లింది. ఈ క్రమంలో రాజీవ్‌, శిరీషల అక్రమ సంబంధం బయటపడింది. దీంతో తేజస్విని తరుచూ రాజీవ్‌ స్టుడియోకి వెళ్లి గొడవ పెట్టుకునేది. ఈ క్రమంలో మే 30న తేజస్విని రాజీవ్‌ స్టుడియోకు వెళ్లినప్పుడు శిరీష, తేజస్విని మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రాజీవ్‌ పోలీసులకు ఫోన్‌ చేయడంతో వారి ఘర్షణ అక్కడికి చేరింది. పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో శిరీష తనకు తెలిసిన శ్రావణ్‌కుమార్‌ను సంప్రదించింది.
శ్రావణ్‌ తనకు తెలిసిన కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డిని సమస్య పరిష్కరించమని కోరాడు. జూన్‌ 12న రాజీవ్‌, శ్రవణ్‌, శిరీష కుకునూర్‌పల్లి కారులో బయలుదేరారు. రాత్రి 11.30 గంటల నుంచి 2.30 గంటల వరకు కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి క్వార్టర్స్‌లోనే వీరంతా గడిపారు. నలుగురూ కలిసి మద్యం తాగిన తర్వాత ఎస్‌ఐ, రాజీవ్‌, శ్రవణ్‌ కొద్దిసేపు బయటకు వెళ్లారు. బయట ఎస్‌ఐ వారితో మాట్లాడుతూ.. రాజీవ్‌, శ్రావణ్‌లను ప్రాసిక్యూషన్‌ డెన్‌ వద్దకు వెళ్లాలని సూచించారు. వారి మాటలు విన్న శిరీష వారిద్దరూ వెళ్లిపోతే ఒక్కదాన్నే ఇక్కడ ఉండిపోతానని భయపడింది. దీంతో తన లోకేషన్‌ను భర్త ఫోన్‌కు పంపించింది. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి గదిలోకి వెళ్లిన కాసేపటికే శిరీష గట్టిగా కేకలు వేసింది. దీంతో రాజీవ్‌, శ్రావణ్‌ లోపలకు వచ్చేసరికి ఓ పక్కన భయభయంగా వణికిపోతూ కనిపించింది. నన్నేమీ చేయొద్దని కేకలు వేస్తోంది. దీంతో ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి నేనేమీ చేయలేదు కదా. కంగారు పడకు అని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా శిరీష అరవడం మానకపోవడంతో రాజీవ్‌ చెంపపై కొట్టాడు. గొడవ ఇంకా పెరుగుతుండగా ఎస్‌ఐ సలహా మేరకు రాజీవ్‌, శ్రవణ్‌ ఆమెను కారులో ఎక్కించుకుని బయలుదేరారు. మార్గమధ్యలో శిరీష కారు డోర్‌ ఓపెన్‌ చేసి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో వారిద్దరూ శిరీషను పట్టుకునే క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. వీరు మార్గమధ్యలో ఉండగానే ఎస్‌ఐ.. రాజీవ్‌కు రెండుసార్లు ఫోన్‌ చేసి శిరీష పరిస్థితిపై ఆరా తీశారు.కారులో ముగ్గురూ షేక్‌పేట్‌కు చేరుకున్న వెంటనే శిరీష నేరుగా ఫొటోగ్రఫీ కార్యాలయంలోని గదిలోకి వెళ్లిపోయింది. రాజీవ్‌, శ్రవణ్‌ కిందే ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ పైకి వెళ్లి డోర్‌ కొట్టగా శిరీష తీయలేదు. తర్వాత శ్రవణ్‌ను ఇంటికి పంపించేందుకు రాజీవ్‌ క్యాబ్‌ బుక్‌ చేశాడు. అదే సమయంలో శిరీష.. రాజీవ్‌కు వీడియో కాల్‌ చేసింది. అయితే రాజీవ్‌ లిఫ్ట్‌ చేయలేదు. కొద్దిసేపటి తర్వాత రాజీవ్‌ ఫోన్‌ చేయగా ఆమె తీయలేదు. తర్వాత ఫ్లాట్‌కు వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేయగా శిరీష ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే అంబులెన్స్‌ కోసం 100కు ఫోన్‌ చేశాడు. కత్తితో చున్నీ కట్‌ చేసి మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టాడు. ఈలోగా శ్రవణ్‌ తిరిగి రావడంతో ఇద్దరూ కలిసి శిరీషను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.’ అని కమిషనర్‌ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow