సీబీఐ కోర్టులో జ‌గ‌న్ కు ఊర‌ట‌

Spread the love

హైదరాబాద్ : మొత్తం మీద‌ వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట ల‌భించింది. ఆయ‌న‌కు మంజూరు చేసిన‌ బెయిలును రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించక‌పోగా… సీబీఐ చూపిన ఆధారాలతో బెయిల్‌ రద్దు చేయలేమని కోర్టు పేర్కొంది. వై.ఎస్‌.ఆర్‌.సీ.పి. నేత‌ జగన్ అభ్య‌ర్థ‌న మేర‌కు కోర్టు ఆయ‌న‌కు విదేశీ పర్యటన అనుమ‌తినిచ్చింది. మే 15 నుంచి జూన్ 15లోగా ఏవైనా 15 రోజుల్లో న్యూజీల్యాండ్ పర్యటించ‌వ‌ని కోర్టు సూచించింది. అయితే కుటుంబంతో కలిసి వెళ్లాలని షరతు విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow