షాకింగ్ న్యూస్…. దర్శకరత్న ఇక మనకు లేరు…!

Spread the love

షాకింగ్ న్యూస్
దర్శకరత్న ఇక మనకు లేరు…!

దర్శకరత్న దాసరినారాయణరావు అస్వస్తతో కన్నుమూశారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ మాట అసలు జీర్ణించుకోలేనిది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇండస్ట్రీలో ఇకలేరు అని అనలేకపోతున్నాం. దర్శకుడికే ఒక వన్నెని తీసుకువచ్చి ఆ కుర్చీకి ఎంతో విలువను తీసుకువచ్చిన ఆయన ఎన్నో చిత్రాలను తీశారు. ఎంతో మంది హీరోలకి స్టార్ డమ్ ని తీస్కుని వచ్చారు.

“డా. దాసరి నారాయణరావు” ( మే 4, 1947 – మే 30, 2017) ఆంధ్రప్రదేశ్ కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు.

దాసరి మొత్తం 140 సినిమాలకు దర్శకత్వం వహించారు. చివరి చిత్రం ఎర్రబస్సు 2014లో విడుదల అయ్యింది. నటుడు గా కూడా ఆయన 64 సినిమాలు చేశారు. అందులో ఎమ్మెల్యే ఏడుకొండలు పెద్ద హిట్. బొబ్బిలిపులి, ప్రేమాభిషేకం, సర్దార్ పాపరాయుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ సహా శివరంజని, గోరింటాకు, బలిపీఠం, ఒసేయ్ రాములమ్మ, ఒరేయ్ రిక్షా వంటి సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow