డ్రగ్స్, కల్తీల నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా వెళ్లండి సీఎం కేసీఆర్‌

Spread the love

డ్రగ్స్, కల్తీల నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా వెళ్లండి సీఎం కేసీఆర్‌


డ్రగ్స్, కల్తీల నియంత్రణ విషయంలో మరింత దూకుడా ముందుకు వెళ్లాలని, అన్ని కోణాల నుంచి లోతుగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కల్తీలకు పాల్పడడం, డ్రగ్స్ సరఫరా చేయడం లాంటి దుర్మార్గాలు తెలంగాణలో చేయలేమని అక్రమార్కులు భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ దందాలో ఎవరి ప్రమేయం ఉన్నా వదలవద్దని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులైనా, చివరికి కేబినెట్ మంత్రి పాత్ర ఉన్నా కేసు పెట్టాలని ఆదేశించారు. రక్తాన్ని కూడా కల్తీ చేసి అమ్ముతున్నారనే విషయం తెలిసి తన మనసెంతో చలించిందని, ఇలాంటి వారికి జీవితకాల కారాగార శిక్ష పడే విధంగా అవసరమైతే కొత్త చట్టాలు తేవాలని సిఎం అన్నారు. పేకాట, గుడుండా నియంత్రణ విషయంలో విజయం సాధించినట్లే డ్రగ్స్, కల్తీల విషయంలో కూడా తుది విజయం సాధించే వరకు విశ్రమించవద్దని అధికారులను కోరారు. డ్రగ్స్, కల్తీలను అరికట్టే విషయంలో తెలంగాణ పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులు చేస్తున్న కృషి చాలా గొప్పగా ఉందని సిఎం ప్రశంసించారు.
డ్రగ్స్, కల్తీలు, ఇతర సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, సోమేశ్ కుమార్, శాంతి కుమారి, ఎక్సైజ్ కమీషనర్ చంద్రవదన్, జిహెచ్ఎంసి కమీషన janardhan reddy. ఎసిబి డిజి పూర్ణచందర్ రావు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్, సెక్యూరిటీస్ ఐజి ఎన్.కె. సింగ్, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్, హైదరాబాద్, వరంగల్ రేంజ్ ఐజిలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
‘‘రాష్ట్రంలో ఆహార పదార్థాల కల్తీ, విత్తనాల కల్తీల విషయంలో, డ్రగ్స్ నియంత్రించే విషయంలో అధికారులు బాగా పనిచేస్తున్నారు. ఈ దందాలో భాగస్వామ్యం ఉన్న వారెందరో దొరుకుతున్నారు. ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ దందాలున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో వీటి నియంత్రణ విషయంలో చాలా చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మనకు మంచి పేరు వచ్చింది. ఇప్పటికే చేపట్టిన చర్యలతో సంతృప్తి చెందవద్దు. విశ్రమించవద్దు. ఇంకా దూకుడు ప్రదర్శించాలి. తుది వరకు శ్రమించాలి. పనిలో మరింత తీవ్రత పెంచండి. లోతుల్లోకి వెళ్లాలి. ఎవరెవరి పాత్ర ఎంతుందో వెలికి తీయాలి. బాధ్యులైన వారందిపైనా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ విషయంలో అధికారులకు కావాల్సిన అధికారాలు, స్వేచ్ఛ ఇస్తున్నది. ప్రభుత్వ ఉద్దేశ్యం చాలా స్పష్టం. తెలంగాణ రాష్ట్రంలో కల్తీలు, డ్రగ్స్ దందా ఉండొద్దు. చట్ట వ్యతిరేక చర్యలకు ఈ రాష్ట్రంలో చోటు లేదు. ఎంతటి వారైనా సరే పట్టుకోండి. ఎంతటి ప్రముఖుడైనా వదలొద్దు. రాజకీయ నాయకులున్నా సరే కేసు పెట్టండి. టిఆర్ఎస్ వారి పాత్ర ఉన్నా సరే, వారిపై కేసులు పెట్టి జైలుకు పంపండి. కేబినెట్ మంత్రి ఉన్నా కేసు పెట్టండి. ప్రభుత్వానికి ఎవరినీ కాపాడాల్సిన అవసరం లేదు. అక్రమార్కుల ఆటకట్టించే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. మీకున్న అనుభవం, అధికారం ఉపయోగించి తెలంగాణ రాష్ట్రంలో ఈ అక్రమ దందాలను అరికట్టండి’’ అని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు.
‘‘హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా, వాడకం ఎప్పటి నుంచో ఉంది. గత పాలకులు ఈ విషయంలో అశ్రద్ధ చూపారు. వారే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడీ దుర్మార్గం మనకు వారసత్వంగా వచ్చి ఉండేది కాదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడం అత్యంత అవసరం. హైదరాబాదే తెలంగాణకు లైఫ్ లైన్. కాబట్టి హైదరాబాద్ లో అరాచకం అంతం కావాలి. కేసు పరిశోధనలో ఉన్న సమయంలో
సెలవులో వెళ్లవద్దని నేనే అకున్ సభర్వాల్ కు సూచించా. కేసు పూర్వోపరాలన్నీ క్షుణ్ణంగా వెలికి తీయండి. ఎవరినీ వదలద్దు. అందరినీ శిక్షించాలి. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేయలేము, వినియోగించలేము అని భయభ్రాంతులయ్యేలా మన చర్యలుండాలి. హైదరాబాద్ బాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటిగా మార్చాలి’’ అని సిఎం కేసీఆర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow