“తల్లి వేరు” పుస్తకాన్ని ఆవిష్కరించినముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

Spread the love

“తల్లి వేరు” పుస్తకాన్ని ఆవిష్కరించినముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో హెవళంబి నామ ఉగాది కవిత్వం – 2017 సంకలనం “తల్లి వేరు” పుస్తకాన్నిముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్క‌రించారు. భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో ‘హేవళంబి నామ ఉగాది కవి సమ్మేళనం – 2017’ మార్చ్ 29న ఉగాది పండుగ రోజున రవీంద్రభారతిలో నిర్వహించారు. ఆ సంకలనాన్ని భాషా సాంస్కృతిక శాఖ రూపొందించగా, ఇటివల రవీంద్రభారతి కార్యాలయాన్ని సందర్శించిన  ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెవళంబి నామ ఉగాది కవిత్వం – 2017 సంకలనం “తల్లి వేరు” పుస్తకాన్ని ఆవిష్కరించినారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ డా. నందిని సిధారెడ్డి, హోం మంత్రి  నాయిని నర్సింహా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  SP సింగ్, I.A.S, పర్యాటక – సాంస్కృతిక కార్యదర్శి  బి. వెంకటేశం, I.A.S, ప్రభుత్వ సలహాదారులు డా. K.V. రమణాచారి I.A.S (Retd.), ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి  దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. పుస్తకాన్ని చూసి భాగుందని, “తల్లివేరు” పేరు భాగుందని, సాంస్కృతిక శాఖని అభినందిస్తూ, ముఖ్యమంత్రి గారు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow