ద్రౌపది ముర్ము భార‌త మొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రప‌తి కానున్నారా…??

Spread the love

ద్రౌపది ముర్ము భార‌త మొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రప‌తి కానున్నారా…??

త్వ‌ర‌లో రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీ కాలం ముగుస్తుండ‌డంతో అంద‌రి దృష్టి ప్ర‌స్తుతం ఆ ఎన్నిక పైనే ఉంది. అస‌లు ప్ర‌ధాని మోదీ మ‌దిలో ఎవ‌రున్నార‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌. ద్రౌపది ముర్మునే ప్రధాని మోడీ ప్రణవ ముఖర్జీ తరువాత మన రాష్ట్రపతి గా చేయ‌నున్నార‌ని భోగ‌ట్టా. వాస్త‌వానికిఇ ఎల్‌.కె. అద్వానీ అవుతార‌ని అంద‌రూ భావించారు. అనూహ్య‌మైన విధంగా ఆయ‌న పాత కేసులు తిర‌గ‌రాయ‌డంతో ప‌ద‌వి ద‌క్క‌డం అనుమానంగా మారింది. మ‌రో వైపు మురళీ మనోహర్ జోషి, చివరికి రజనీకాంత్ వంటి వారి పేర్లు చక్కర్లు కొట్టినా, సీనియర్ నాయకులు తో అనేక సార్లు చర్చలు జరిపినా మోడీ తన మార్కు రాజకీయంతో ద్రౌపది ముర్ము పేరు తెరపైకి తీసుకు వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు.

ఎవరీ ద్రౌపది ముర్ము ?

ప్రస్తుతం మేడమ్ ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. గత 20 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ఉంటున్న రాజకీయ నిపుణురాలు. భారతదేశ మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతి గా రాబోతున్న మహిళ. తండ్రి “బిరంచి నారాయణ తుడు”. ఒరిస్సా లో పుట్టి పెరిగిన ఈమె అక్కడి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు :

2007 వ సంవత్సరంలో ఒరిస్సా శాసనసభ ద్రౌపది ముర్ము కి బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు ఇచ్చి గౌరవించింది. ఈమె ‘నీలకంఠ’ అవార్డు గ్రహీత కూడా. 1997 లో మొట్టమొదటి సారిగా కౌన్సిలర్ గా ఎన్నికైనా, తర్వాత రాయ్ రణపూర్ న్యాక్‌కు వైస్ చైర్మన్ అయ్యారు. తరువాత రాయ్ రణపూర్, ఒరిస్సా నియోజకవర్గాలనుండి MLA గా ఎన్నికైన గానీ, తరువాత రాష్ట్ర మంత్రి గా కూడా పనిచేసారు. 2002 -2009 మధ్య కాలంలో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌గా, ఎస్‌.టి. మోర్చా కు సభ్యులు గా ఉన్నారు.

ప్రణబ్ ముఖర్జీ తరువాత :

25 జూలై 2017 తో ముగియనున్న ప్రణబ్ ముఖర్జీ కాల‌ప‌రిమితి. తరువాత ద్రౌపది ముర్ము ఆ పదవిని చేపట్టబోతున్నారా?? ఇదేగాని జరిగితే ఈమె మొట్టమొదటి ఆదివాసీ మహిళా భారత రాష్ట్రపతి గా చరిత్ర కెక్కనున్నారు. ప్రతి పక్షాలు కూడా ఈమె సభ్యత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితులు లేవని అభిజ్ఞాన వర్గాల భోగట్టా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow