హర్యానా ప్రభుత్వం స‌మ‌న్వ‌యంతో ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్

Spread the love

భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిభింబించేలా ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని హర్యానా ప్రభుత్వంతో పకడ్భందిగా నిర్వహించడానికి అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ అన్నారు. సోమవారం సచివాలయంలో ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ కార్యక్రమణ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ శ్రీ నవీన్ మిత్తల్, వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ పార్ధసారధి, టూరిజం మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బి.వెంకటేశం, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి శ్రీ సవ్యసాచి ఘోష్, టూరిజం కార్పోరేషన్ యం.డి. క్రిస్టినా జడ్ చౌంగ్ తు, యువజన సర్వీసుల శాఖ కమీషనర్ శ్రీ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ యం.డి. శ్రీ దినకర్ బాబు, విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ విజయకుమార్, టూరిజం శాఖ కమీషనర్ శ్రీమతి సునితా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిభింబించేలా హర్యానా లో రోడ్ షో, ఫుడ్ ఫెస్టివల్, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు తదితర అంశాలతో రోజంతా జరిగే మెగా ఈవెంట్ ని నిర్వహించాలన్నారు. ఈ ఈవేంట్లో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు హర్యానా నుండి వచ్చే యాత్రికులకు విమానాశ్రయాలు, రైల్యేస్టేషన్లు, హోటళ్ళలో స్వాగత కార్యక్రమాల తో పాటు కొంతకాలం (15 రోజులు) రాయితీ కల్పనకు సంబంధించిన కార్యచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి ప్రాధాన్యత చూపుతున్న ఏక భారత్ – శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆలోచనలు, అభిప్రాయాల మేరకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హర్యానా, తెలంగాణ రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్యంతో ట్యాబ్ లో రూపకల్పన, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, కవులు, రచయితల మధ్య సమావేశాలు, విద్యార్ధులకు ఎడ్యుకేషనల్ టూర్స్, వ్యాసరచన పోటీలు, యాత్రికులకు హోంస్టే, ఫోటోగ్రఫీ పోటీలు, ఫుడ్ ఫెస్టివల్స్ లాంటి అంశాలపై చర్చించారు. హర్యానాకు సంబంధించి కుస్తీ పోటీలలో పేరు పొందినందున తెలంగాణ యువకులను హర్యానాకు పంపి శిక్షణ నిచ్చే విధంగా చూడాలన్నారు. వ్వవసాయానికి సంబంధించి సాంప్రదాయ పద్ధతులతో పాటు హరియానాలో పాడిపరిశ్రమ, హిస్సార్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఒప్పందం వంటి విషయాలపై చర్యలు తీసుకోవాలన్నారు. హర్యానాలో హైవే టూరీజంపై అధ్యయనం చేయాలన్నారు.

తెలంగాణ కళాకారులకు హర్యానా కళారూపాలలో, హర్యానా కళాకారులకు తెలంగాణ కళారూపాలలో శిక్షణ నిచ్చే విధంగా చూడాలన్నారు. తెలంగాణ కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలపై హర్యానాలో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
రూరల్ టూరిజం, సాహసక్రీడలు,గిరిజన పండుగలు, షాపింగ్ ఫెస్టివల్స్, పెరల్ ఫెస్టివల్, హర్యానా లో బతుకమ్మ పండుగ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. వచ్చే సమ్మక్క సారలమ్మ జాతరను అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ కోసం నెక్లెస్ రోడ్, గచ్చిబౌలి, ఆబిడ్స్ ప్రాంతాలను ఎంపిక చేసి నగరాన్ని సందర్శించే యాత్రికులు, వివిధ ఐటి కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు అందుబాటులో ఉంచేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టూరిజం శాఖ కార్యదర్శి శ్రీ బి.వెంకటేశం మాట్లాడుతూ గౌరవ ప్రధాన మంత్రి సమక్షంలో తేది. 30-10-2016న హర్యానా ప్రభుత్వంతో MoU పై సంతకం చేయడం జరిగిందని, ఇందులో భాగంగా సూరజ్ కుంజ్ లో ఇప్పటికే కార్యక్రమం నిర్వహించినట్టు సియస్ కు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow