చిత్త‌శుధ్దితో ప‌నిచేసే కార్మికుడి నుండి ఉద్యోగి వ‌ర‌కు ఉన్న‌త స్థాయి గౌర‌వాన్నిఇస్తాం

Spread the love

ఉత్త సేవలు అందించినవారికి గు గౌరవం

 

విధి నిర్వ‌హ‌ణ‌లో ఉత్త‌మ ఫ‌లితాలు సాధించ‌డం నిజాయితిగా చిత్త‌శుధ్దితో ప‌నిచేసే కార్మికుడి నుండి ఉద్యోగి వ‌ర‌కు ఉన్న‌త స్థాయి గౌర‌వాన్ని అందిస్తామ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి అన్నారు. నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ ఇంజ‌నీర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ దేశంలో ఎక్క‌డాలేనివిధంగా 44ల‌క్ష‌ల డ‌స్ట్‌బిన్‌ల‌ను, 2వేల ఆటోట్రాలీల‌ను ఉచితంగా అంద‌జేశామ‌ని వీట‌న్నింటినీ పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడాల్సిన బాధ్య‌త ఉద్యోగులు, సిబ్బందిదేన‌ని అన్నారు.  సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగ‌గంలో విశేష కృషిచేసిన‌వారికి త‌గిన గుర్తింపు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని, అవ‌స‌ర‌మైతే ఇత‌ర రాష్ట్రాల‌కు, న‌గ‌రాల‌కు పంపించి ఆయా రంగాల్లో వినూత్న విధానాలను అద్య‌య‌నం చేయించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. న‌గ‌రంలోని ప్ర‌తి ఇంటింటి నుండి త‌డి, పొడి చెత్త‌ను వేరు చేయ‌డంలో నిరంత‌ర కృషి అవ‌స‌ర‌మ‌ని అన్నారు. ఈ విష‌యంలో ప్ర‌సార మాద్య‌మాల ద్వారా విస్తృత ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలో త‌డి, పొడి చెత్త‌ను వేర్వేరుగా త‌ర‌లించే స‌ర్కిళ్ల‌వారిగా స‌మీక్షించారు.

కొనసాగిన హోటళ్లపై దాడులు….

న‌గ‌రంలో జీహెచ్ఎంసీ అధికార ముద్ర లేని మాంసాహార విక్ర‌యం, అప‌రిశుభ్రంతో ఉన్న హోట‌ళ్ల‌పై జీహెచ్ఎంసీ అధికారులు వ‌ర‌స‌గా రెండ‌వ రోజు దాడులు నిర్వ‌హించారు. సోమ‌వారం నాడు మొత్తం 27 హోట‌ళ్ల‌పై త‌నిఖీలు నిర్వ‌హించి అప‌రిశుభ్రంగా, అన‌ధికార మాంసాన్ని ఉప‌యోగిస్తున్న 15 హోట‌ళ్ల‌పై 1,96,000 రూపాయ‌ల జ‌రిమానాలు విధించారు. నేడు మంగ‌ళ‌వారం నాడు కూడా త‌నిఖీలు నిర్వ‌హించారు. ఎల్బీన‌గ‌ర్‌ స‌ర్కిల్ -3ఏలోని నాగోల్‌లో అమ‌రావ‌తి హోట‌ల్‌లో త‌నిఖీలు నిర్వ‌హించ‌గా జీహెచ్ఎంసీ అధికారిక క‌బేళా నుండి కాకుండా అన‌ధికార మాంసాహారాన్ని ఉప‌యోగిస్తున్నందున రూ. 30వేలు జ‌రిమానా విధించారు. మ‌ల్కాజ్‌గిరి స‌ర్కిల్‌లోని వెన్నెల బార్ అండ్ రెస్టారెంట్ పై దాడులు నిర్వ‌హించ‌గా అప‌రిశుభ్ర మాంసం, ఆహార ప‌దార్థాలు ఉండ‌డంతో రూ. 40వేలు జ‌రిమానాను విధించారు. అదేవిధంగా మ‌ల్కాజ్‌గిరిలోని డాల్‌ఫిన్ రెస్టారెంట్‌కు రూ. 25వేల‌ను జ‌రిమానాగా విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow