బ‌ల్దియా గార్బెజ్ స్టేష‌న్ల‌కు స‌రికొత్త సొబ‌బులు

Spread the love

గార్బెజ్ స్టేష‌న్ల‌కు స‌రికొత్త సొబ‌బులు

న‌గ‌రంలోని ట్రాన్స్‌ఫ‌ర్ స్టేష‌న్ల‌న్నింటినీ న‌వీక‌ర‌ణ చేయాల‌ని క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ఆదేశాలు జారీచేయ‌డంతో అన్ని స్టేష‌న్ల నిర్వ‌హ‌ణ‌లో పెనుమార్పులు తెచ్చారు. స్టేష‌న్ల‌కు అంద‌మైన రంగులు వేయ‌డం, గోడ‌ల‌పై ఆక‌ర్ష‌నీయ‌మైన చిత్రాలు వేయ‌డం ద్వారా గార్బెజ్ స్టేష‌న్ అనే భావ‌న క‌లుగ‌కుండా చేశారు. దీనితో పాటు ప్ర‌తిరోజు గార్బెజ్ స్టేష‌న్‌ల‌ను నీటితో శుభ్ర‌ప‌ర్చాల‌న్న ఆదేశాల మేర‌కు అన్ని స్టేష‌న్ల‌ను శుభ్ర‌ప‌రుస్తున్నారు. ముఖ్యంగా ఇమ్లీబ‌న్ బ‌స్టాండ్ ట్రాన్స్‌ఫ‌ర్ స్టేష‌న్‌ను చూస్తే అది ట్రాన్స్‌ఫ‌ర్‌స్టేష‌న్ లా కాకుండా బ‌య‌టి నుండి చేస్తే కార్పొరేట్ ఆఫీసు మాదిరిగా ఉంటుంది. గ‌తంలో ఈ స్టేష‌న్‌లో గుట్ట‌లుగుట్ట‌లుగా చెత్త పేర్కొని ఉండే ప‌రిస్థితులు నేడు లేవు. ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త‌ను త‌ర‌లించ‌డంతో పాటు ప్ర‌తిరోజు ఈ గార్బెజ్ స్టేష‌న్‌ను శుభ్ర‌ప‌ర‌స్తున్నారు. గార్బెజ్ ట్రాన్స్‌ఫ‌ర్ స్టేష‌న్లు ఒక‌ప్పుడు గుట్ట‌లుగుట్ట‌లుగా చెత్త‌తో దుర్గంధంతో నిండి ఉండేవి, దీని వ‌ల్ల గార్బెజ్ త‌ర‌లించే బ‌ల్దియా కార్మికులు, డ్రైవ‌ర్లు, గార్బెజ్ ట్రాన్స్‌ఫ‌ర్ స్టేష‌న్‌లో ప‌నిచేసే సిబ్బందికి త‌ర‌చుగా అనారోగ్యం భారీన ప‌డేవారు. అయితే ఈ ప‌రిస్థితిని మొత్తం మార్చేశారు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి గార్బెజ్ ట్రాన్స్‌ఫ‌ర్‌స్టేష‌న్‌ల‌లో ఏమాత్రం చెత్త‌ను నిలువ ఉంచ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంపింగ్‌యార్డ్‌కు త‌ర‌లించాల‌ని, ఇందుకు అద‌నంగా వాహ‌నాల‌తో ట్రిప్పులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. దీంతో న‌గ‌రంలో ఉన్న దాదాపు అన్ని ట్రాన్స్‌ఫ‌ర్‌స్టేష‌న్‌లో జీరో ప‌రిమాణంలో చెత్త ఉండేలా ట్రాన్స్‌ఫ‌ర్‌స్టేష‌న్ల నిర్వ‌హ‌ణ అధికారులు త‌గు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. దీంతో గ‌తంలో ఉన్న ట్రాన్స్‌ఫ‌ర్ స్టేష‌న్ల నిర్వ‌హ‌ణ‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పు ల‌భించి దాదాపు అన్ని స్టేష‌న్ల‌లో జీరో గార్బెజ్ ఉండేలా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow