వ‌ర్షాల వ‌ల్ల ముంపు స‌మ‌స్య‌కు ప‌రిష్కారాలు సూచించండి – ఇంజ‌నీర్ల‌ను కోరిన‌ జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్*

Spread the love

వ‌ర్షాల వ‌ల్ల ముంపు స‌మ‌స్య‌కు ప‌రిష్కారాలు సూచించండి – ఇంజ‌నీర్ల‌ను కోరిన‌ జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో అక‌స్మిక వ‌ర్షాల వ‌ల్ల ప‌లు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ఉండ‌డం, వ‌ర‌ద‌నీటి కాల్వ‌ల నిర్మాణం, ఇంకుడు గుంత‌ల ఏర్పాటు ఇత‌ర సాంకేతిక అంశాల‌పై పూర్తిస్థాయి అద్య‌య‌నంచేసి త‌గు ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాల‌ని రిటైర్డ్ ఇంజ‌నీర్లు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీర్స్‌, రిటైర్డ్ ప్రొఫెస‌ర్లు, ప‌ట్ట‌ణ ప్ర‌ణాళికాధికారులకు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. న‌గ‌ర వ‌ర‌ద‌లు – హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌త్యామ్న‌య మార్గాలు అనే అంశంపై కూక‌ట్‌ప‌ల్లిలోని జె.ఎన్‌.టి.యు సాంకేతిక విశ్వ‌విద్యాల‌యంలో నేడు నిర్వ‌హించిన ఒక‌రోజు స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఒకేసారి అతిత‌క్కువ స‌మ‌యంలో భారీ ప‌రిమాణంలో వ‌ర్షాలు కురిసే ప‌రిస్థితులు ఇటీవ‌ల కాలంలో ఎదుర్కొంటున్నామ‌ని, ఈ అక‌స్మిక భారీ వ‌ర్షాల వ‌ల్ల అనేక ప్రాంతాలు ముంపుకు గుర‌వుతున్నాయ‌ని అన్నారు. రెండు సెంటీ మీట‌ర్ల వ‌ర్షాన్నిమాత్ర‌మే త‌ట్టుకునే సామ‌ర్థ్యం ప్ర‌స్తుతం ఉన్న నాలాల‌కు ఉంద‌ని, వీటి సామ‌ర్థ్యం పెంచ‌డంతో పాటు శివారు ప్రాంతాల్లో వ‌ర‌ద‌నీటి డ్రెయిన్‌ల‌ను మ‌రింత ప‌టిష్టంగా నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అర్భ‌న్ ఫ్ల‌డ్డింగ్ వ‌ల్ల ఎదుర‌య్యే స‌మ‌స్య‌లకు స‌రైన ప‌రిష్కార మార్గాన్ని శాస్త్రీయ ప‌ద్ద‌తిలో అద్య‌య‌నం చేయాల‌ని సీనియ‌ర్ ఇంజ‌నీర్లకు విజ్ఞ‌ప్తి చేశారు. 400 సంవ‌త్స‌రాల‌కు పైగా చారిత్ర‌క హైద‌రాబాద్ న‌గ‌రంలో నాలాల ఆధునీక‌ర‌ణ స‌వాల్‌తో కూడుకున్న‌ద‌ని, జీహెచ్ఎంసీ వ‌ద్ద ఉన్న ప‌రిమిత స్థాయిలో నిధులు ఉన్న‌ప్ప‌టికీ హేతుబ‌ద్దంగా ప‌నులను చేప‌ట్టాల్సిన అవ‌శ్య‌క‌త ఉంద‌ని జ‌నార్థ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో 450 కిలోమీట‌ర్ల మేర అర్బ‌న్ ఫ్ల‌డ్ స్టార్మ్ వాట‌ర్ డ్రెయిన్ నిర్మాణం, నివాసాల‌లో 2,70,350 రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్ నిర్మాణాల‌ను, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, స్థ‌లాల్లో 17,767 హార్వెస్టింగ్ నిర్మాణాల‌ను, 636 వాట‌ర్ ట్యాంక్‌ల‌ను నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని త‌మ అద్య‌య‌నంలో తేలింద‌ని జె.ఎన్‌.టి.యు ప్రిన్సిప‌ల్ డా.ఇ.సాయిబాబారెడ్డి, సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ కో-ఆర్డినేట‌ర్ ప్రొఫెస‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్‌రావులు తెలిపారు. *జీహెచ్ఎంసీలో అర్బ‌న్ ఫ్ల‌డ్ స్టార్మ్ వాట‌ర్ నెట్‌వ‌ర్క్‌* అనే అంశంపై చేప‌ట్టిన అద్య‌య‌నంలోని అంశాల‌ను ప్రొఫెస‌ర్ ల‌క్ష్మ‌ణ్‌రావు వివ‌రించారు. వ‌ర‌ద కాల్వ‌ల నిర్మాణానికే రూ. 400 కోట్లు అవ‌స‌రం అవుతుంద‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేశామ‌ని, వీటితో పాటు ఇంకుడు గుంత‌లు, వాట‌ర్ ట్యాంక్‌ల నిర్మాణానికి రూ. 2000 కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతాయ‌ని పేర్కొన్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో అతి తీవ్ర వ‌ర్ష‌పాతం న‌మోదు కావ‌డం, మ‌రికొన్ని ప్రాంతాల్లో సాదార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదు కావ‌డం ఇటీవ‌ల వ‌ర్ష‌పాత వివ‌రాలు తెలియ‌జేస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

వేగంగా పెరుగుతున్న న‌గ‌రీక‌ర‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ అసంతుల‌న‌, వాతావ‌ర‌ణ మార్పులు ఈ భారీ వ‌ర్షాల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ నిర్వ‌హ‌ణ విభాగం చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌తో పాటు ఇంజ‌నీర్లంద‌రూ ఈ వ‌ర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*