స్విమ్మింగ్… ఫుట్‌బాల్ టోర్న‌మెంట్లకు….ఎంట్రీల‌ను ఆహ్వానించిన బ‌ల్దియా

Spread the love

స్విమ్మింగ్… ఫుట్‌బాల్ టోర్న‌మెంట్లకు….ఎంట్రీల‌ను ఆహ్వానించిన బ‌ల్దియా

న‌గ‌రంలో ఫుట్‌బాల్ క్రీడను ప్రోత్స‌హించ‌డానికి ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వ‌ర‌కు రెడ్ హిల్స్‌లోని జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్‌లో ప్ర‌త్యేక టోర్న‌మెంట్ నిర్వ‌హిస్తున్న‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ‌జేశారు. న‌గ‌రంలోని అన్ని ఫుట్‌బాల్ క్ల‌బ్‌లు ఈ టోర్న‌మెంట్లో పాల్గొన‌డానికి ఈ నెల 20వ తేదీలోపు త‌మ ఎంట్రీల‌ను టోర్న‌మెంట్ జాయింట్ సెక్ర‌ట‌రీ మ‌హ్మ‌ద్ షౌక‌త్ అలీ సెల్ 98489 48837 అనే నెంబ‌ర్ ద్వారా న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు. ఈ టోర్న‌మెంట్‌లో పాల్గొనే ఫుట్‌బాల్ క్ల‌బ్‌ల‌కు ఎంట్రీ ఫీజులేద‌ని స్ప‌ష్టం చేశారు.

22, 23 తేదీల‌లో ఓపెన్ స్విమ్మింగ్ కాంపిటీష‌న్లు

ఈ నెల 22, 23తేదీల‌లో సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో బాల‌బాలిక‌ల‌కు ప్ర‌త్యేకంగా స్విమ్మింగ్ పోటీల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు. బాయ్స్, గ‌ర్ల్స్‌ విభాగంలో అండ‌ర్ 8 నుండి ఎబో 15 సంవ‌త్స‌రాల వ‌ర‌కు బ్రీస్ట్‌స్ట్రోక్‌, ఫ్రీ స్టైల్‌, బ‌ట‌ర్‌ఫ్లైస్ట్రోక్ త‌దిత‌ర విభాగాల్లో నాన్‌మెడ‌లిస్ట్, మెడ‌లిస్ట్‌ పోటీల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇందుకుగాను 18తేదీ లోపు త‌మ ఎంట్రీల‌ను అంద‌జేయాల‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow