బ‌ల్దియా వాహ‌నాల‌కు స‌రికొత్త హంగులు

Spread the love

జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే దాదాపు 500ల‌కు పైగా చెత్త త‌ర‌లింపు వాహ‌నాలకు బ్రాండింగ్ చేసి రేడియం స్టిక్క‌ర్లు, సైడ్ ఇండికేట‌ర్స్ అమ‌ర్చ‌డంతో ఈ వాహ‌నాల రూపురేఖ‌లు మొత్తం మారి స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ గార్బెజ్ త‌ర‌లించ‌డానికి ప‌ది ర‌కాల వాహ‌నాల‌ను ఉప‌యోగిస్తోంది. ఈ వాహ‌నాలు పూర్తిగా నిర్వాహ‌ణ‌లోపంతో ఉండి పాత వాహ‌నాలుగా క‌నిపించేవి. మొత్తం చెత్త త‌ర‌లింపు వాహ‌నాల‌న్నింటికి క‌ల‌రింగ్‌చేసి బ్రాండింగ్ చేయాల‌ని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌లు ఆదేశిండంతో గ‌త రెండు రోజులుగా జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసే 500వాహ‌నాల‌కు బ్రాండింగ్ పూర్తిచేశారు. ఇటీవ‌ల సికింద్రాబాద్ ఖార్కానా వ‌ద్ద రాత్రి జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు మ‌ర‌ణించిన సంఘ‌ట‌న విదిత‌మే. ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన జీహెచ్ఎంసీ అద్దె వాహ‌నానికి సైడ్ ఇండికేట‌ర్స్‌, రేడియం స్టిక్క‌ర్స్‌తో పాటు క‌నీసం జీహెచ్ఎంసీ అద్దెవాహ‌నం అని తెలిపే పెయింటింగ్ కూడా లేక‌పోవ‌డాన్ని మంత్రి గ‌మ‌నించారు. వెంట‌నే జీహెచ్ఎంసీ గార్బెజ్ వాహ‌నాల‌కు బ్రాండింగ్ చేయాల‌ని మంత్రి ఆదేశించ‌డంతో చెత్త త‌ర‌లింపు వాహ‌నాలు, స్వీపింగ్ మిష‌న్లు, జె.సి.బిలు, వెట‌ర్న‌రి వాహ‌నాల‌కు బ్రాండింగ్ పూర్తిచేశారు. 25ట‌న్నుల వాహ‌నాలు, మినీ టిప్ప‌ర్లు, డంప‌ర్ ప్లేస‌ర్లు, స్వీపింగ్ మిష‌న్లు, బాబ్‌కాట్స్‌, జె.సి.బిలు, వాట‌ర్ ట్యాంక‌ర్లు, వెట‌ర్న‌రి వాహ‌నాలన్నింటికి రేడియం స్టిక్క‌ర్లు, టేల్ ల్యాంప్ బ్లింక‌ర్లు, జీహెచ్ఎంసీ బ్రాండ్ స్టిక్క‌ర్లతో పాటు క‌ల‌రింగ్ కూడా పూర్తిచేశారు. దీంతో బ‌ల్దియా చెత్త త‌ర‌లింపు వాహ‌నాల‌న్నీ స‌రికొత్త‌గా క‌నిపిస్తూ రాత్రివేళ‌లో కూడా రేడియం స్టిక్క‌ర్ల‌తో వెలుగులు చిమ్ముతూ ప్ర‌తిఒక్క‌రు వెంట‌నే గుర్తించేలా అయ్యాయి.

వెయ్యి డ్రైవ‌ర్ల‌కు శిక్ష‌ణ‌

ప్ర‌జా భ‌ద్ర‌త అంశాలు, మ‌ద్య‌పానంతో క‌లిగే అన‌ర్థాలు, ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌పై జీహెచ్ఎంసీలోని గార్బెజ్ త‌ర‌లించేవాహ‌నాల డ్రైవ‌ర్ల‌తో పాటు లైట్ మోటార్ వాహ‌నాల డ్రైవ‌ర్ల‌కు కూడా జీహెచ్ఎంసీ శిక్ష‌ణ‌ను ఇప్పిస్తోంది. జీహెచ్ఎంసీలో ఉన్న దాదాపు వెయ్యి మంది డ్రైవ‌ర్ల‌కు గోషామ‌హ‌ల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో గ‌త రెండు రోజులుగా బ్యాచీల వారిగా శిక్ష‌ణ‌ను అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow