దాదాపు 400 ఏళ్ల త‌ర్వాత మైసూర్ రాజ్యానికి శాపం నుంచి విముక్తి

Spread the love

దాదాపు 400 ఏళ్ల త‌ర్వాత మైసూర్ రాజ్యానికి శాపం నుంచి విముక్తి

దాదాపు 400 ఏళ్ల త‌ర్వాత మైసూర్ రాజ్యానికి శాపం నుంచి విముక్తి లబించిన‌ట్టుంది. ప్ర‌స్తుత మైసూర్ యువ‌రాజు యుదువీర్ క్రిష్ణ‌ద‌త్తా చ‌మారాజా ఒడియార్ తండ్రి కాబోతున్నాడు. అవును.. దాదాపు 400 ఏళ్లు గా ఆ రాజ్యంలో పిల్ల‌ల అలికిడి లేదు. ఆ రాజ్యాన్ని ప‌రిపాలించిన ఏ రాజుకు పిల్ల‌లు పుట్ట‌లేదు. అయితే.. మే 2015 లో మైసూర్ రాజ్యానికి రాజ‌యిన యుదువీర్, జూన్ 2016 లో రాజ‌స్థాన్ యువ‌రాణి త్రిషికా ను వివాహ‌మాడాడు. త్రిషిక ఇప్పుడు నాలుగు నెల‌ల గ‌ర్భ‌వ‌తి. దీంతో మైసూర్ రాజ్యంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ”

ఏంటా శాపం?

ఇది 400 సంవ‌త్సరాల క్రితం జ‌రిగిన స్టోరీ. 1399 నుంచి 1950 వ‌ర‌కు అంటే ఇండియా రిప‌బ్లిక్ అయ్యేంత‌వ‌ర‌కు మైసూర్ ను ఒడియార్స్ ఫ్యామిలీనే ప‌రిపాలించేది. అయితే.. విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాన్ని ప‌రిపాలిస్తున్న తిరుమ‌ల రాజా రాజ్యాన్ని మైసూర్ ను ప‌రిపాలించే రాజా ఒడియార్ 1 అన్యాయంగా లాక్కొన్నాడు. దీంతో కోపోద్రికురాలైన రాజు తిరుమ‌ల‌రాజా భార్య అల‌మేల‌మ్మ రాజా ఒడియార్ మీద తీవ్ర‌మైన ద్వేషం పెంచుకుంది. త‌ర్వాత ఆమె రాజ్యం వ‌దిలేసి త‌న ఆభ‌రణాల‌ను తీసుకొని మ‌లంగి (ఇప్పుడు త‌ల‌కాడు) అనే గ్రామానికి వెళ్లిపోయింది. అయితే.. అల‌మేల‌మ్మ తీసుకెళ్లిన ఆభ‌ర‌ణాల‌ను తీసుకురావాల‌ని ఒడియార్ రాజా తన సైనికుల‌ను ఆదేశిస్తాడు. దీంతో… అల‌మేల‌మ్మ ను చుట్టుముడుతుంది ఒడియార్ సైన్యం. అప్పుడు.. మైసూర్ రాజ్యం ఎక్కువ కాలం నిల‌బ‌డ‌ద‌ని.. ఆ రాజ్యాన్ని ఏలే రాజుల‌కు పిల్ల‌లు పుట్ట‌రని…త‌ల‌కాడు ఎడారి లా మారుతుంద‌ని… యుక్త వ‌య‌సులోనే రాజులు చ‌నిపోతారని శ‌పించి కావేరీ న‌దిలో దూకింది అలమేల‌మ్మ‌. ఈ ఘ‌ట‌న జ‌రిగిన సంవ‌త్స‌రం 1612 అని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. అల‌మేల‌మ్మ శ‌పించిన‌ట్టుగానే త‌ల‌కాడు ఎడారిలా మ‌రిపోయింది. మైసూర్ ను ఏలే రాజుల‌కు పిల్ల‌ల భాగ్యం క‌ల‌గ‌లేదు. ఇంకా.. యుక్త వ‌య‌స్సులోనే చాలా మంది ఒడియార్ రాజులు మ‌ర‌ణించారు. ఇదంతా అల‌మేల‌మ్మ శాపం ఫ‌లిత‌మేన‌ని భావించారు ఒడియార్ రాజులు. అందుకే.. బంధువుల‌లో ఎవ‌రో ఒక‌రిని ద‌త్త‌త తీసుకొని వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మైసూరు రాజుగా ప‌ట్టాభిషేకం చేసేవారు. ప్ర‌స్తుత రాజు యుదువీర్ ను కూడా ద‌త్త‌త తీసుకున్నారు. అయితే.. యుదువీర్ భార్య త్రిషికా కుమారి దేవి గ‌ర్భ‌వ‌తి అవ్వ‌డంతో ఆ శాపానికి ఇక విముక్తి క‌లిగిన‌ట్టేన‌ని.. ఇక నుంచి మైసూర్ రాజ్యానికి అంతా మంచే జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు మైసూరు ప్ర‌జ‌లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow