సుల్తాన్ బజార్ ప్రసూతి దవాఖానాలో ఇద్దరు బాలింతల మృతి మీద విచారణకు ఆదేశించిన మంత్రి లక్ష్మారెడ్డి

Spread the love

త్వరలో నివేదిక ఇవ్వాలని డిఎంఇకి మంత్రి ఆదేశాలు

బాలింతల మృతికి సంతాపం, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపిన మంత్రి

బాలింతల మృతికి కారకులైన వారెవరినీ వదలబోమన్న మంత్రి లక్ష్మారెడ్డి

తప్పెవరిదని తేలినా శిక్షిస్తామని తెలిపిన మంత్రి

హైదరాబాద్ : సుల్తాన్ బజార్ ప్రసూతి దవాఖానాలో ఇద్దరు బాలింతల మృతి మీద మంత్రి లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని సూచించారు. బాలింతల మృతి పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపిన మంత్రి, బాలింతల మృతికి కారకులైన వారెవరినీ వదలబోమన్నారు. తప్పెవరిదని తేలినా శిక్షిస్తామని చెప్పారు. మంత్రి ఆదేశాలతో డిఎంఇ రమణి, వెంటనే గాంధీ వైద్యశాలలో ప్రొఫెసర్ అనుపమను ప్రాథమిక విచారణకు ఆదేశించారు. విచారణ కొనసాగుతున్నది.

నిత్యం పదుల సంఖ్యలో ప్రసూతిలు జరిగే హైదరాబాద్లోని ప్రధాన హాస్పిటల్స్లో సుల్తాన్ బజార్ ప్రసూతి కేంద్రం ఒకటి. సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ తెలిపిన వివరాల ప్రకారం యధావిధిగా గురువారం కూడా ప్రసూతిలు జరిగాయి. అందులో 19 సిజేరియన్లయ్యాయి. అయితే ఇందులో ఇద్దరు బాలింతలు దురదృష్టవశాత్తు చనిపోయారు. అరుణా నగర్ కు శారద (22) 18న ప్రసూతి కేంద్రంలో చేరగా, 20న ప్రసూతి అయ్యారు. మొదటి డెలివరీ. ప్రసవ సమయంలో ఆమెకు సెక్షన్ జరిగింది. హై బీపీ పేషంట్ కాగా, ఆపరేషన్ తర్వాత సడెన్గా బీపీ తగ్గింది. బ్లీడింగ్ కాలేదు. కానీ ఆకస్మాత్తుగా 20న చనిపోయింది.

మహబూబ్నగర్ కు చెందిన జయమ్మ (22) 19న మూడో కాన్పు కోసం సుల్తాన్ బజార్ హాస్పిటల్లో చేరారు. అంతకుముందు రెండు కాన్పులు కూడా సీజేరియన్లే. 20న సిజేరియన్ అయింది. బ్లీడింగ్ లేదు. ఆపరేషన్ తర్వాత బీపీ తగ్గింది. దీంతో ఆమె అకస్మాత్తుగా మరణించింది. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ తెలిపారు.

ఇక హయత్నగర్కు చెందిన సుజాత (22) 19న జాయిన్ అయింది. 20న డెలివరీ అయింది. సిజేరియన్ జరిగింది. బీపీ సమస్య రావడంతోపాటు, ఇతర సమస్యల కారణంగా ఈమెను ఉస్మానియా ఎఎంసికి పంపించామన్నారు సుల్తాన్ బజార్ ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow