హోట‌ళ్ల య‌జ‌మానులను ఒప్పించిన బ‌ల్దియా… అందుబాటులోమ‌రో 100 టాయిలెట్లు

Spread the love


న‌గ‌రంలో ఉన్న హోట‌ళ్ల‌లోని టాయిలెట్ల‌ను న‌గ‌ర‌వాసులు ఉప‌యోగించుకునేలా సంబంధిత హోట‌ళ్లు, రెంస్టారెంట్ల యాజ‌మ‌న్యాల‌ను ఒప్పించే ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను జీహెచ్ఎంసీ నేడు చేప‌ట్టింది. దీనిలో భాగంగా నేడు ఒక్క‌రోజే న‌గ‌రంలోని వంద‌కు పైగా హోట‌ళ్లు, రెస్టారెంట్లు త‌మ ఆవ‌ర‌ణ‌లోని టాయిలెట్ల‌ను ప‌బ్లిక్ ఉప‌యోగించుకునేలా అంగీక‌రించ‌డంతో పాటు ప్ర‌త్యేకంగా బోర్డుల‌ను కూడా ఏర్పాటు చేయ‌డానికి అంగీక‌రించాయి. ఇప్ప‌టికే న‌గ‌రంలో ఉన్న 365 పెట్రోల్ బంక్‌ల‌లోని టాయిలెట్ల‌ను అంద‌రూ ఉప‌యోగించుకునేలా చేయ‌డంలో జీహెచ్ఎంసి స‌ఫ‌లీకృత‌మైంది. దీంతో సిటీలోని హోట‌ళ్లు, రెస్టారెంట్లు, దాబాల‌లో ఉన్న టాయిలెట్ల‌ను కూడా అందుబాటులోకి తేవాల‌ని ఈ విష‌యంలో నేడు బుధ‌వారం నాడు జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌త్యేక డ్రైవ్‌ను కొన‌సాగించాల‌ని క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి జీహెచ్ఎంసీ క్ష‌త్ర‌స్థాయి అధికారుల‌ను ఆదేశించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి కూడా స్వ‌యంగా సికింద్రాబాద్‌లో జ‌రిపిన త‌నిఖీల అనంత‌రం చ‌ట్నీస్ హోట‌ల్‌ను సంద‌ర్శించి అందులోని టాయిలెట్‌ను న‌గ‌ర‌వాసులు ఉప‌యోగించుకునేలా అంగీక‌రింప‌జేశారు. ఈ ఆదేశాల్లో భాగంగా జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు త‌మ ప‌రిధిలోని హోట‌ళ్లు, రెస్టారెంట్లు, దాబాల‌ను సంద‌ర్శించారు. ఈ స్పెష‌ల్ డ్రైవ్‌తో టాయిలెట్ల వినియోగించ‌డానికి అంగీక‌రించిన‌వాటిలో ప‌లు ప్ర‌ముఖ హోట‌ళ్లు కూడా ఉన్నాయి.
గాంధేయ ప‌ద్ద‌తి ద్వారా సామాజిక బాధ్య‌త‌ను గుర్తుచేస్తూ డిప్యూటి క‌మిష‌న‌ర్లు త‌మ ప‌రిధిలోని హోట‌ళ్ల య‌జ‌మానుల‌ను చైత‌న్యప‌ర్చ‌డం, సామాజిక సేవాభావాన్ని వారిలో క‌ల్పించి న‌గ‌రం ఎదుర్కొంటున్న టాయిలెట్ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించడం త‌దిత‌ర చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. ఎలాంటి అధికార‌ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌కుండా జోన‌ల్‌, డిప్యూటి క‌మిష‌న‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు చేప‌ట్టిన ఈ కౌన్సిలింగ్ విధానానికి హోట‌ళ్లు, రెస్టారెంట్ల య‌జ‌మానులు వెంట‌నే అంగీక‌రించారు. త‌మ టాయిలెట్ల‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావ‌డంతో పాటు టాయిలెట్ ఉంద‌ని సూచించే బోర్డులు కూడా స్వ‌చ్ఛందంగా ప్ర‌ద‌ర్శించ‌డానికి హోట‌ల్ య‌జ‌మానులు ఏర్పాట్లు చేప‌ట్టారు. దాదాపు కోటి మందికి పైగా జ‌నాభా ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రంలో 435 ప‌బ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వీటితో పాటు మ‌రో 5కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ఏర్పాటు చేసిన 100 మోడ్ర‌న్ ఫ్రీ ఫ్యాబ్రికెటెడ్ టాయిలెట్లు ఉన్నాయి. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బులిటి ప‌థ‌కంలో భాగంగా వివిధ కార్పొరేట్ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల స‌హాయంతో 50 షీ-టాయిలెట్లు ఏర్పాటు చేయ‌డానికి జీహెచ్ఎంసీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇటీవ‌ల నిర్వ‌హించిన గాంధీగిరి సంద‌ర్భంగా 300ల‌కుపైగా పెట్ర‌ల్ బంక్ య‌జ‌మానులు త‌మ బంకుల్లోని టాయిలెట్ల‌ను ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఉప‌యోగించుకునేందుకు అంగీక‌రించారు. ప్ర‌స్తుతం దాదాపు 900 టాయిలెట్లు న‌గ‌ర‌వాసుల సౌక‌ర్యార్థం తేవ‌డంలో జీహెచ్ఎంసీ స‌ఫ‌లీకృత‌మైంది. నేడు ఒక్క‌రోజు చేప‌ట్టిన ఈ ప్ర‌త్యేక డ్రైవ్‌లో అద‌నంగా వంద‌కుపైగా టాయిలెట్లు న‌గ‌ర‌వాసుల వినియోగానికి అందుబాటులోకి వ‌చ్చాయి. గ్రేట‌ర్‌లోని అన్ని హోట‌ళ్ల‌లోని టాయిలెట్ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చేందుకు ఒప్పించే ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ కొన‌సాగుతుంద‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.
టాయిలెట్ల‌ను ఉప‌యోగించుకోవ‌డానికి అంగీక‌రించిన కొన్ని హోట‌ళ్ల వివ‌రాలు…
చ‌ట్నీస్ – సికింద్రాబాద్‌
ఆర్‌.వి.స్పైస్ రెస్టారెంట్
హోట‌ల్ బొమ్మ‌రిల్లు – మియాపూర్‌
హోట‌ల్ చ‌ట్నీస్ – ఎల్బీన‌గ‌ర్‌
హోట‌ల్ డిజైర్ రెస్టారెంట్ – అలీకేఫ్, అంబ‌ర్‌పేట్‌
మాస్ట‌ర్ చెఫ్ రెస్టారెంట్ – ఉప్ప‌ల్
సంతోష్ దాబా – ఉప్ప‌ల్‌
అన్మోల్ హోట‌ల్ – ఈదిబ‌జార్‌
అసీమ్ హోట‌ల్ – మోయిన్‌బాగ్‌
షాలీమార్ హోట‌ల్ – ఫాతిమాన‌గ‌ర్‌
హోట‌ల్ స్వాగ‌త్ గ్రాండ్ – స‌ర్కిల్ -7
షాగౌస్ హోట‌ల్ – స‌ర్కిల్ -7
ఉమ‌ర్ రెస్టారెంట్ – హ‌ఫీజ్ బాబాన‌గ‌ర్‌
హోట‌ల్ ఫిష్‌ల్యాండ్ – ల‌క్డికాపూల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow