లారీ భీబ‌త్సం….. 20 మంది మృతి…..మృతుల‌కు రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌

లారీ భీబ‌త్సం….. 20 మంది మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో ఈ రోజు మ‌ధ్యాహ్నం చోటుచేసుకున్న‌ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. అక్క‌డి పూతల పట్టు- నాయుడు పేట రహదారిలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని దుకాణాల‌పైకి ఒక్క‌సారిగా లారీ దూసుకురావ‌డంతో అక్క‌డి జ‌న‌మంతా ప‌రుగులు పెట్టార‌ని స్థానికులు చెప్పారు. లారీ సృష్టించిన బీభ‌త్సంతో అక్క‌డ విద్యుదాఘాతం కూడా చోటుచేసుకుంద‌ని, షాక్ కొట్టడంతో కొంద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని అన్నారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రుల‌కి చేరుస్తున్నారు. ఇప్ప‌టివ‌కే ప‌లువురిని స్థానికులు ఆసుప‌త్రుల‌కి చేర్చారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న ప్ర‌జ‌లను తీవ్ర దిగ్ర్బాంతికి గురిచేసింది. పూతలపట్టు నాయుడుపేట రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow