బీమా కోసం దారుణ హ‌త్య‌…..బెడిసికొట్టిన నిందితుని ప్లాన్‌

Spread the love
 • బీమా డబ్బుల కోసం భారీ నాటకం
 • తాను చనిపోయాక డబ్బులు వస్తే తనకేం లాభం
 • భీమా కోసం ఓ వ్యక్తిని అతిదారుణంగా హత్య చేశాడు 
 • దారుణ హ‌త్య‌…..బెడిసికొట్టిన నిందితుని ప్లాన్‌
 • ఆ చనిపోయిన వ్యక్తి తానేనని నమ్మించే యత్నం
 • పోస్టుమార్టం నివేదికతో అతడి ప్లాన్ బెడిసికొట్టిన ప్లాన్

  నాసిక్, జూన్ 30 : తన జీవితంపై రూ. 4కోట్లకు బీమా చేయించుకున్నాడో వ్యక్తి. జీవిత బీమా తీసుకుంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఇస్తారు కదా. అయితే కష్టపడి బీమా వాయిదాలు కడుతున్నా తాను పోయాక డబ్బులు వస్తే తనకేం లాభం అనుకున్నాడో ఏమో గానీ.. ఓ విపరీత చర్యకు పాల్పడ్డాడు. ఓ వ్యక్తిని అతిదారుణంగా హత్య చేశాడు. ఆ చనిపోయిన వ్యక్తి తానేనని నమ్మించి బీమా డబ్బులు తీసుకోవాలనుకున్నాడు. అయితే పోస్టుమార్టం నివేదికతో అతడి ప్లాన్ బెడిసికొట్టింది. మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
  అసలేం జరిగిందంటే..
  నాసిక్లోని త్రయంబేకశ్వర్లో జూన్ 9న ఓ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వాహనం బలంగా ఢీకొట్టడంతో అతడి ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైంది. మృతదేహం వద్ద ఉన్న ఏటీఎం కార్డు, కరెంట్ బిల్లు ఆధారంగా అతడిని రామ్దాస్ వాఘ్గా గుర్తించారు. అతడు స్థానికంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్. దీంతో రామ్దాస్ చనిపోయినట్లుగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
  కథ మలుపు తిరిగిందిక్కడే..
  పోస్టుమార్టం చేసిన వైద్యులు.. అతడికి ప్రమాదం కాదు హత్య అని చెప్పారు. అతడిని ముందు గొంతు నులిమి చంపేశారని, ఆ తర్వాత ముఖాన్ని ఛిద్రం చేశారని చెప్పారు. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. రామ్దాస్ గురించి వివరాలు తెలుసుకునేందుకు అతడి కుటుంబం, స్నేహితులను కలిశారు.
  దిమ్మతిరిగే షాక్..
  రామ్దాస్ కుటుంబసభ్యులు, స్నేహితులు చెప్పింది విని పోలీసులకు దిమ్మతిరిగింది. ఎందుకంటే హత్యకు గురయ్యాడని చెబుతున్న రామ్దాస్ బతికే ఉన్నాడని, తమ మధ్యే తిరుగుతున్నాడని అతడి సన్నిహితులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని మళ్లీ పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతిచెందింది రామ్దాస్ కాదు. స్థానిక రెస్టారెంట్లో పనిచేసే ముబారక్ చాంద్ పాషా అనే వెయిటర్. రామ్దాస్ మరో ఇద్దరితో కలిసి పాషాను చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంతకీ ఇదంతా ఎందుకు చేశాడో తెలుసా..? తన పేరుమీదున్న బీమా డబ్బుల కోసం. రామ్దాస్ తన పేరుమీద వేర్వేరు కంపెనీల నుంచి రూ. 4కోట్లకు బీమా చేయించుకున్నాడు. ఆ డబ్బు కోసమే పాషాను హత్య చేసి.. ఆ మృతదేహం తనదిగా నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే పోస్టుమార్టం నివేదికతో అతడి ప్లాన్ బట్టబయలైంది. ప్రస్తుతం రామ్దాస్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow