త‌డి, పొడి చెత్త‌ను వేరుచేసే మ‌హిళ‌ల‌కు ల‌క్ష రూపాయ‌ల బ‌హుమ‌తి

Spread the love

త‌డి, పొడి చెత్త‌ను వేరుచేసే మ‌హిళ‌ల‌కు ల‌క్ష రూపాయ‌ల బ‌హుమ‌తి

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో త‌డి, పొడి చెత్త‌ను వేరుచేసే గృహిణీల‌కు ప్రోత్స‌హకంగా ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తి అందించే ప‌థ‌కం స్వ‌చ్ఛ‌దూత్‌ను రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు నేడు సాయంత్రం ప్రారంభించారు. త‌డి, పొడి చెత్త‌ను వేరు చేయ‌డం ద్వారా 75శాతం చెత్త‌ను పున‌ర్వినియోగం అవుతున్నందున త‌ప్ప‌నిస‌రిగా ఇంటి వ‌ద్ద‌నే వేర్వేరు చేయ‌డానికి జీహెచ్ఎంసీ హైద‌రాబాద్ న‌గ‌రంలో 44ల‌క్ష‌ల డ‌స్ట్‌బిన్‌ల‌ను ఉచితంగా పంపిణీ చేసింది. దాదాపు 29కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో డ‌స్ట్‌బిన్‌ల‌ను అందించినప్ప‌టికీ పూర్తిస్థాయిలో ల‌క్ష్యాన్ని చేరుకునే దిశ‌గా జీహెచ్ఎంసీ ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది. ఇందుకుగాను ఇంటి వ‌ద్ద‌నే త‌డి, పొడి చెత్త‌గా వేరుచేసి జీహెచ్ఎంసీ గార్బెజ్ క‌లెక్ట‌ర్ల‌కు అందించే మ‌హిళ‌లు ల‌క్ష రూపాయ‌ల బ‌హుమ‌తి పొంద‌డానికి త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకునేందుకు అనువుగా *స్వ‌చ్ఛ దూత్* మొబైల్ యాప్‌ను జీహెచ్ఎంసీ రూపొందించింది. ఈ యాప్‌ను నేడు మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు హోట‌ల్ తాజ్‌కృష్ణ‌లో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి స్వ‌చ్ఛ‌దూత్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వ‌న్‌టైం రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని సూచించారు. అనంత‌రం తాము ఇంట్లో చేప‌డుతున్న త‌డి, పొడి చెత్త వేర్వేరుచేసే డ‌స్ట్‌బిన్‌ల ఫోటోల‌ను అప్‌లోడ్ చేయాల‌ని సూచించారు. ఈ యాప్‌ద్వారా వ‌చ్చిన ఎంట్రీలను ప్ర‌తి నెలా లాట‌రీ తీసి ఒక గృహిణీకి ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. ఇప్ప‌టికే త‌డి, పొడి చెత్త వేరు చేయ‌డానికి ఇటింటికి రెండు డ‌స్ట్‌బిన్‌ల‌ను అందించ‌డం, చెత్త సేక‌ర‌ణ‌కు 2వేల స్వ‌చ్ఛ ఆటో ట్రాలీల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా దేశంలోని ఇత‌ర మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల క‌న్నా ముందంజ‌లో ఉన్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ చెత్త‌ను వేరు చేయ‌డంలో ప్ర‌తి గృహిణీని చైత‌న్య ప‌ర్చ‌డంతో పాటు వంద శాతం ల‌క్ష్యాన్ని సాధించ‌డానికి ప్ర‌తినెలా ఒక గృహిణీకి ల‌క్ష రూపాయ‌ల బ‌హుమానాన్ని అందించాల‌నే విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాన్ని తీసుకుంద‌ని మంత్రి ప్ర‌శంసించారు. చెత్త‌ను వేర్వేరు చేయ‌డం ద్వారా తిరిగి 75శాతం మ‌ళ్లీ ఉప‌యోగించుకునేందుకు అవ‌కాశం ఉన్నందున త‌డి, పొడి చెత్త వేరు చేసే ప్ర‌క్రియ‌ను మ‌రింత ఉద్య‌మ స్థాయిలో చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు మంత్రి వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, వైద్య‌, ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్వ‌ర్ తివారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow