బీహార్ గ‌వ‌ర్న‌ర్ రాంనాథ్ కోవింద్ ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన ఎన్డీయే

Spread the love

బీహార్ గ‌వ‌ర్న‌ర్ రాంనాథ్ కోవింద్ ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన ఎన్డీయే

అనూహ్య‌మైన వ్య‌క్తిని ఎన్డీయే భార‌త దేశ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా నియ‌మించింది. ప్ర‌స్తుతం బీహార్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న రాంనాథ్ కోవింద్ ను ఎంపిక చేసింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఈ విష‌యాన్ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మీడియాకు వెల్ల‌డించారు. రాంనాథ్‌ కోవిద్ పేరుపొందిన న్యాయ‌వాది.. ద‌ళిత నేత‌. ఆయ‌న రెండు సార్లు పార్ల‌మెంట్ స‌భ్యునిగా ప‌నిచేశారు. మొత్తం మీద కొన్ని రోజుల‌గా రాష్ట్రప‌తి అభ్య‌ర్థిత్వంపై ఎన్డీయే మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. రాంనాథ్‌ను పేరు ప్ర‌క‌టించి ఉత్కంఠ‌కు తెర‌దించింది. తేరాస రాంనాథ్ అభ్య‌ర్థిత్వాన్ని స‌మ‌ర్థించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow