అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ‘నీరు-ప్రగతి’ కార్య‌క్ర‌మం

Spread the love

అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ‘నీరు-ప్రగతి’ కార్య‌క్ర‌మం
ఛాయా చిత్రాల పోటీ నిర్వహించాలని నిర్ణ‌యం

విజయవాడ, జూన్ 30, : రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు-ప్రగతి కార్యక్రమంలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది. 2017 ఏప్రిల్ 20 నుంచి ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం జూలై 20వ తేదీతో విజయవంతంగా ముగియబోతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నీరు-ప్రగతి పథకాన్ని ప్రతిబింబించే ఛాయా చిత్రాల పోటీ నిర్వహించాలని నిర్ణయించింది. ఆసక్తిగల ఫొటో జర్నలిస్టులు, ఔత్సాహికులు ఈ పోటీలో పాల్గొనడానికి ఎంట్రీలు పంపుకోవచ్చు. ఉత్తమమైన ఫొటోలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్టు కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ ఎస్. వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. నీరు ప్రగతిపై తీసిన ఫొటోలు 10 గీ 12 సైజులో ఉండాలి. ఫొటోలకు సంబంధించిన వివరాలు, ఆయా ప్రాంత రైతాంగం లేదా స్థానిక లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించి, క్లుప్తంగా 20 పంక్తులలో రాసిన ఎంట్రీలను జులై 13లోగా సమాచార, పౌర సంబంధాల శాఖ, ఆర్టీసీ ప్రాంగణం, 2వ అంతస్తు, విజయవాడ-13, కు పోస్టులో కానీ వ్యక్తిగతంగా కానీ అందజేయవలెను.

నగదు బహుమతులు :
ఉత్తమ ఛాయాచిత్రాలకు ప్రథమ బహుమతిగా రూ. 20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేలు, కన్సొలేషన్ బహుమతిగా 10 చిత్రాలకు ఒక్కోదానికి వెయ్యి రూపాయలు, ప్రశంసా పత్రం అందజేయనున్నట్టు కమిషనర్ తెలిపారు.
పోటీలో పాల్గొనదలచిన వారు తమ ఎంట్రీ ఫారాలను కమిషనర్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖా కార్యాలయంలో లేదా లేదా జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నుండి పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow