బెజవాడలో ‘నిన్నుకోరి’ బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ జూలై 16న

Spread the love

బెజవాడలో ‘నిన్నుకోరి’ బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ జూలై 16న

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మించిన చిత్రం ‘నిన్నుకోరి’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో సూపర్‌హిట్‌ చిత్రంగా అందరి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అపూర్వ ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు జూలై 16 సాయంత్రం 6 గంటలకు విజయవాడ బందర్‌ రోడ్‌లోని ఎ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘నిన్నుకోరి బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌’ నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ నిర్ణయించింది. ఈ సెలబ్రేషన్స్‌లో నేచురల్‌ స్టార్‌ నాని, హీరోయిన్‌ నివేదా థామస్‌, ప్రత్యేక పాత్ర పోషించిన ఆది పినిశెట్టితోపాటు టోటల్‌ యూనిట్‌ పాల్గొంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow