రోడ్డు ప్ర‌మాదం చేశారో మూడు ల‌క్ష‌ల జ‌రిమానా ఏడు సంవ‌త్స‌రాలు జైలు

Spread the love

*రోడ్డు ప్ర‌మాదం చేశారో మూడు ల‌క్ష‌ల జ‌రిమానా ఏడు సంవ‌త్స‌రాలు జైలు*
డ్రంక్ అండ్ డ్రైవ్ పై బ‌ల్దియా డ్రైవ‌ర్ల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు

రోడ్డు ప్ర‌మాదానికి కార‌కులై ఓ వ్య‌క్తి మ‌ర‌ణించిన సంద‌ర్భంలో సంబంధిత డ్రైవ‌ర్ స్వ‌యంగా రూ. 3ల‌క్ష‌లు జ‌రిమానా చెల్లించ‌డంతో పాటు ఏడు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌లో ట్రాఫిక్ గీత‌ల‌ను అక్ర‌మంగా ఉల్ల‌ఘించ‌డం, రెడ్‌లైట్ ఉన్న‌ప్పుడు జంప్ చేయ‌డం త‌దిత‌ర నిబంధ‌న‌ల అతిక్ర‌మ‌ణ‌కు రూ. 10వేల నుండి రూ. 20వేల వ‌ర‌కు జ‌రిమానాతో పాటు ఒక‌టి నుండి ఆరు నెల‌లోపు జైలు శిక్ష విదింపు. మ‌ళ్లీ ఇదేర‌క‌మైన ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డితే పై శిక్ష‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు చేయ‌డం జ‌రుగుతుంది.* అని జీహెచ్ఎంసీ డ్రైవ‌ర్ల‌కు గ‌త రెండు రోజులుగా నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక శిక్ష‌ణ‌లో చైత‌న్యప‌రుస్తున్నారు. బ‌ల్దియాలో చెత్త‌త‌ర‌లింపుకు ఉప‌యోగించే 25ట‌న్నుల వాహ‌నాలు, మినీ టిప్ప‌ర్లు, డంప‌ర్ ప్లేస‌ర్లు, స్వీపింగ్ మిష‌న్లు, బాబ్‌కాట్స్‌, జె.సి.బిలు, వాట‌ర్ ట్యాంక‌ర్లు, వెట‌ర్న‌రి వాహ‌నాల‌తో పాటు అధికారులు ఉప‌యోగించే లైట్ మోట‌ర్ కార్ల డ్రైవ‌ర్లంద‌రికీ రోడ్డు భ‌ద్ర‌త‌పై ప్ర‌ధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ వ‌ల్ల క‌లిగే అన‌ర్థాలు, దానికి చెల్లించాల్సిన మూల్యాన్ని గోషామ‌హాల్‌లో ఉన్న ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్ష‌ణ‌ను ఇప్పిస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఉన్న వెయ్యి మందికి పైగా డ్రైవ‌ర్ల‌కు పోలీసు శాఖ‌కు చెందిన ట్రాఫిక్ విభాగం సీనియ‌ర్ అధికారులు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ను ఇప్పిస్తున్నారు. ఇటీవ‌ల సికింద్రాబాద్ ఖార్కానా స‌మీపంలో జ‌రిగిన ప్ర‌మాదంలో న‌లుగురు మ‌ర‌ణించిన సంఘ‌ట‌న నేప‌థ్యంలో బ‌ల్దియా వాహ‌నాల‌న్నింటికీ బ్రాండింగ్ చేయ‌డంతో పాటు డ్రైవ‌ర్లంద‌రికీ రోడ్డు భ‌ద్ర‌త‌, డ్రంక్ అండ్ డ్రైవ్ వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల‌పై పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. గ‌త మూడు రోజుల నుండి ద‌శ‌ల‌వారిగా డ్రైవ‌ర్ల‌కు శిక్ష‌ణ‌ను ఇప్పిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 600మందికి శిక్ష‌ణ పూర్తికాగా మ‌రో 400మందికి రెండు రోజుల్లోగా శిక్ష‌ణ‌ను ఇప్పించ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow