కొడంగల్ నియోజకవర్గ అధికారులతో మంత్రుల‌ స‌మీక్ష‌

Spread the love
  • ప్రభుత్వ పథకాలన్నీ పక్కాగా అమలు కావాలి
    ఉపాధి పనుల్లో వేగం పెంచాలి
  • ప్రతి గ్రామంలోనూ వైకుంఠదామాలు, డంప్ యార్డు నిర్మాణాలు చేపట్టాలి
  • ఎమ్మెల్యే క్వార్టర్, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు స్థల సేకరణ వేగంగా పూర్తి చేయాలి
  • సచివాలయంలో కొడంగల్ నియోజకవర్గ అధికారులతో
  • మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్రెడ్డిల సమీక్ష

హైదరాబాద్-ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్రెడ్డిలు అన్నారు. సచివాలయంలో కొడంగల్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ అధికారులతో ఆదివారం మంత్రులు సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో మండలాల వారీగా అమలవుతున్న కార్యక్రమాలపై శాఖలవారీగా చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరాలన్నారు. ఆ దిశగా అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో ఉపాధి పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని.. కార్యాచరణ సిద్దం చేసుకుని ముందుకు పోవాలని మంత్రి జూపల్లి సూచించారు. ప్రతి గ్రామంలోనూ వైకుంఠదామాలను నిర్మించుకోవాలని…వారం రోజుల్లో స్థల సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కొడంగల్లో ఎమ్మెల్యే గృహ సముదాయ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను అర్హులకు వెంటనే చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని…ఇందుకోసం అవసరమైతే గ్యాస్ ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలోనూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow