సీఎం కేసీఆర్ స్వాగ‌త స‌త్కారాల‌కు ముగ్దుడైన రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్

Spread the love

సీఎం కేసీఆర్ స్వాగ‌త స‌త్కారాల‌కు ముగ్దుడైన రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్

హైద‌రాబాద్ : ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి టీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లికింది. సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స్వాగ‌త స‌త్కారాల‌కు రామ్‌నాథ్ కోవింద్ ముగ్దుడ‌య్యాడు. న‌గ‌రం నిండా స్వాగ‌త తోర‌ణాలతో రామ్‌నాథ్‌కు టీఆర్ఎస్ ఘ‌న‌స్వాగ‌తం ప‌లికింది. తెలంగాణ వంట‌కాల‌తో విందు భోజ‌నం ఏర్పాటు చేశారు. అనంత‌రం సీఎం స‌హా మంత్రులు విమానాశ్ర‌యం దాకా వెళ్లి వీడ్కోలు ప‌లికారు.
రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న తనకు సంపూర్ణ మద్దతు ప్ర‌క‌టించిన‌ టిఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రామ్‌నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరడానికి హైదరాబాద్ వచ్చిన కోవింద్ జ‌ల‌విహార్‌లో టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే కేసీఆర్ మద్దతు పలకారని గుర్తు చేశారు. తనకు ఇక్కడ ఘనస్వాగతం పలకడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్ సభ పార్టీ పక్షనేత జితేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ అతిథులుగా పాల్గొన్నారు.
టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. కోవింద్ ను వెంకయ్య నాయుడు సభకు పరిచయం చేశారు. కె.కేశవరావు ప్రారంభోపన్యాసం చేయగా, జితేందర్ రెడ్డి వందన సమర్పణ చేశారు. జలవిహార్ లో కోవింద్ కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి, ఆయనకు జలవిహార్ లో తెలంగాణ వంటకాలతో కూడిన మద్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం బేగంపేట విమానాశ్రయం వరకు వెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు. విమానాశ్రయం వద్ద మంత్రులందరినీ కోవింద్ కు పరిచయం చేశారు. ఉదయం బేగంపేట విమానాశ్రయంలో టిఆర్ఎస్ పార్టీ తరుఫున ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఈటెల రాజెందర్, నాయిని నర్సింహరెడ్డి రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ కు ఘన స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow