గ్లోబల్లో గుండె మార్పిడులు చేయించుకున్నవారిని పరామర్శించిన మంత్రి

Spread the love

ట్రాన్స్‌ప్లాంటేష‌న్‌ పేషంట్లకు ఫ్రీ మెడిసిన్

గ్లోబల్లో గుండె మార్పిడులు చేయించుకున్నవారిని పరామర్శించిన మంత్రి

హైదరాబాద్ – పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ సర్కార్ అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి. బీద వారికి పునర్ జన్మనిచ్చే పథకంగా ఆరోగ్య శ్రీ అని చెప్పారాయన. ఆదివారం గ్లోబల్ హస్పిటల్ లో హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ అయిన నలుగురు పేషంట్లను ఆయన పరామర్శించారు. వైద్య రంగానికి అధిక ప్రాధ్యానతను ఇస్తున్న సర్కార్ కు కార్పొరేట్ హాస్పటల్స్ సహకరించడం మంచి పరిణామని అన్నారు. తెలంగాణలో జూన్ 2016 నుంచి ఇప్పటి వరకు ఆరుగురికి హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు జరుగగా, మరో ఎనిమిది మందికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు జరిగాయని మంత్రి వివరించారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి బాగుందని బాగా కోలుకుని తమ పనుల చేసుకోగులుగుతున్నారని, ఇది ఎంతో సంతోషదాయకమన్నారు.

హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు ఇప్పటి వరకు 6 జరిగితే… వాటిల్లో సెంచరీ హాస్పిటల్ లో ఒకటి, నిమ్స్ లో ఒకటి, గ్లోబల్ లో నాలుగు జరిగాయని తెలిపారు. ఇక లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ లో ఉస్మానియా హాస్పిటల్ లో మూడు, నిమ్స్ లో రెండు, గ్లోబల్ ఒకటి, యశోదలో రెండు, కిమ్స్ లో రెండు జరిగాయన్నారు మంత్రి. అయితే ఆరోగ్య శ్రీ కింద ఇచ్చే ప్యాకేజీలోనే ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ అవయవ మార్పిడులు చేయడం ఆహ్వానించదగ్గ విషయంగా మంత్రి కొనియాడారు. అవయవ మార్పిడులలో కొంత వ్యయం అధికమవుతున్నా, తమ లాభాలను తగ్గించుకోవడమేగాక, కొంత సేవా దృక్పథంతో ప్రైవేట్ హాస్పిటల్స్ ముందుకు వచ్చి నిరుపేదల ఆరోగ్య సౌభాగ్యంలో మేము సైతం అంటూ ప్రభుత్వానికి సహకరించడం సంతోషదాయకం అన్నారు.

ఇక అవయవ మార్పిడులు చేసుకున్న రోగులందరికీ దీర్ఘకాలికంగా లైఫ్ టైమ్ ఖరీదైన మందులు వాడాల్సిన అవసరం ఉంటుందని మంత్రి తెలిపారు. అలాంటి లైఫ్ సేవింగ్ మెడిసిన్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. మానవీయ కోణంలో కేటాయించిన నిధుల నుంచి ఇలాంటి ఆపరేషన్లు చేయించుకున్న రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ నలుగురు రోగులకి కూడా ఆ మందులు పూర్తి ఉచితంగా అందిస్తామని మంత్రి రోగులకి హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వాలు సాహసం చేయని విధంగా కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతుందని వివరించారు. ప్రభుత్వ వైద్య శాలలను స్ట్రేంథెన్ చేయడంతో పాటు గాంధీ హాస్పిటల్ లో ప్రత్యేకంగా ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ల కోసం ఆపరేషన్ థియేటర్ల ను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు చేయించుకున్న పేషెంట్లకు ఆపరేషన్ తర్వాత కూడా ఉచితంగా మందులను ప్రభుత్వమే అందిస్తోందని తెలిపారు మంత్రి లక్ష్మారెడ్డి.

ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సహాయం హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్న హైదరాబాద్ కు చెందిన ఎర్ర సుందర్ రాజ్, ఖమ్మం కు చెందిన లక్ష్మీ నారాయణ, ఆదిలాబాద్ కు చెందిన సుశీల, నిజామాబాద్ కు చెందిన కస్తూరి మోహన్ లను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితులను, వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద వర్గాలకు అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. ఇదే సమయంలో చికిత్స పొందుతున్న పేషంట్లు మంత్రితో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డిని కొనియాడారు. సీఎం కేసీఆర్ తమకు పునర్ జన్మను అందించారని పేషెంట్స్ మంత్రికి చెప్పారు. తమ కుటుంబాలు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి లక్ష్మారెడ్డికి రుణపడి ఉంటాయని తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మంత్రి లక్ష్మారెడ్డితోపాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ డాక్టర్ చంద్రశేఖర్, హాస్పిటల్ ఎండి రవీంద్రనాథ్, వైద్యులు, అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow