అనేక ప్ర‌శ్న‌ల‌ను రేకెత్తిస్తున్న‌…… స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్‌ల ఆత్మ‌హ‌త్య‌లు

Spread the love

అనేక ప్ర‌శ్న‌ల‌ను రేకెత్తిస్తున్న‌…… స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్‌ల ఆత్మ‌హ‌త్య‌లు
వీటి నివార‌ణ‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తున్న మాజీ ఉన్న‌తాధికారులు

పోలీసు స‌బ్ స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్‌ల ఆత్మహత్యలు తెలంగాణాలో అనేక ప్ర‌శ్న‌ల‌ను రేకెత్తిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఆరుగురు ఎస్సైలు ఆత్మ హత్యలు పోలీస్ వ్యవస్థను ప‌ని తీరుపై అనుమానాల‌కు తావిస్తోంది. పోలీసుల పనిగంటలు ఎక్కువైనా పై అధికారుల వత్తిడి ఇప్పుడు చర్చాశం గా మారింది …సిద్దిపేట జిల్లా కుకునూరు లో ఒకే రూంలో ఇద్దరు ఎస్సైలు ఆత్నహత్య చేసుకోవడం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది .ఉన్న‌తా ధికారుల ఒత్తిడికి తట్టుకోలేక ఈ ఆత్మ హత్యలు చేసుకున్నట్టు ఒక అంచ‌నా. మాఫియా, రాజ‌కీయ నాయ‌కుల‌ ఒత్తిడే ఇందుకు కారణ‌మా… అస‌లు తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్లో ఏం జరుగుతోంది . తెలంగాణా రాష్ట్రంలో ఎస్సైల ఆత్మ హత్యల పై మా స్పెషల్ కరస్పండెంట్ ఇన్నారెడ్డి రిపోర్ట్

సిద్దిపేట జిల్లాలో ని కుకునూరుపల్లి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్‌రెడ్డి బుధవారం తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి స్వస్థలం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టం‍గుటూరు. ఎస్సై ప్రభాకర్ రెడ్ది కు రెండు సంత్సరాల క్రితమే మ్యారేజ్ అయింది …రెండు నెలకిరతమె కొడుకు పుట్టాడు భార్య దెలివరీ కని వెల్లి . ఈ మద్యనే డ్యూటీ లో జాయి అయ్యారు …. గతంలో 2016 ఆగష్టు లో ఇదే పోలీస్ ష్టేషన్ లో ఎస్సైగా పని చేసిన రామ కృష్టా రెడ్డి కూడా ఇదే రూం లో తన సర్వీస్ రివాల్వర్ తో కాచుకొని ఆత్మ హత్య చేసుకొని చనిపోయాడు…అక్కడ ఇసుక మాఫియా పై కఠినంగా వుండతమే ఈ రెండు ఆత్మ హత్యలకు కారనమా .. ఈ ఇసుకమాఫియా పై అధికారులతో ఒత్తిడి చేసి ఆత్మహత్యలకు కారణం అయ్యారు అని ఆరోపనలు వినిపిస్తున్నాయి … ఏస్సై ప్రభాకర్ రెడ్డి సిఏం పేరుతో మూడు పేజీల సూసైడ్ లెటర్ రాసినట్టు సమాచరం ఆ ఉత్త‌రం లో త‌న‌ను మానసికంగా వేధించిన ఉన్నతాధికారులు .. వెనక ఒత్తిడి తీసుకొచ్చిన ఇసుక మాఫియా వివరాలు ఉన్నట్టుగా భోగ‌ట్టా. ఈ విషయం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ దాకా వెల్లడంతో ఆయ‌న సీరియస్ గా తీసుకొని దర్యాప్తు కు ఆదేశించినట్టు తెలుస్తోంది . మొదట ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి ఆ తర్వాత తెలంగాణ‌ లో జరిగిన ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌ల‌పై కూడా ఓ నివేదిక ఇవ్వమని కోరారు. మ‌రో కేసు కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణరెడ్డి ఆత్మహత్య కూడా అనేక అనుమానాల‌కు తావిస్తోంది. ఎస్సై రామకృష్ణరెడ్డి విచారణలో పలు వాస్తవాలు బయటపడ్డాయి. అప్పటి సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌, తోగుట సీఐ వెంకటయ్యలే అన్న అంచ‌నాకు వ‌చ్చి అధికారులతో పాటు ఓ కానిస్టేబుల్‌ను స‌స్పెండ్‌ చేశారు. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు తన భార్య రేఖను రివాల్వర్‌తో కాల్చి తాను కాల్చుకుని ఆత్మహత్చ చేసుకోవడానికి ఉన్నతాధి కారుల ఒత్తిడే కారణమంటూ ఆరోపణ‌లు వినిపిస్తున్నాయి . ఎస్సై చిట్టిబాబును సస్పెండ్‌ చేస్తూ విధుల నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుందన్న విషయం తెలిసి మనస్తాపానికి గురై ఆత్మ హత్యకు పాల్పడ్డాడని పోలీస్‌శాఖ కిందిస్థాయి సిబ్బంది నుంచి వస్తున్న విశ్వసనీయ సమా చారం.
చిట్టిబాబును సిద్దిపేట సీపీ, ఏసీపీలు క్రమశిక్షణ చర్యల కింద డిప్యూటేషన్‌పై సిద్దిపేటకు బదిలీ చేశారన్న కారణం కావచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తు న్నారు. ఈ సందర్భంలోనే సస్పెన్షన్‌ ఆర్డర్స్‌ రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసు కున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.మరో ఘటన అధికారుల వేధింపులు వాస్తవమేనని నిర్ధారణ చేస్తున్నది. హుస్నాబాద్‌ సీఐ దాసరి భూమయ్యను సిద్దిపేట సీపీ సంగారెడ్డికి బదిలీ చేశారు. దీంతో సీఐ సీపీపై కొన్ని ఆరోపణలు చేశారు. తనను నిత్యం వేధిస్తున్నాడని, కరీంనగర్‌లో ఉన్నప్పటి నుంచే కక్ష కట్టాడని ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పాడు. అవినీతి వ్యవహారాలు, ఇతర విషయాలు ప్రశ్నిస్నునందునే తనను ట్రాన్స్‌ఫర్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు…. ఈ కేసు విచారణ‌లో ఏం తేలింది అన్న విషయం పై ద‌ర్యాప్తు నివేదిక‌ను ర‌హ‌స్యంగానే ఉంచారు.

ఉప్పరపల్లిలో ఎస్ఐ శ్రీధర్ ఆత్మ హత్య ఘటన కలకలం రేపుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు బందోబస్తులో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీధర్‌ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. శ్రీధర్ సెల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి దర్యాప్తు చేస్తున్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇందుకోసం వివిధ జిల్లాలు నుండి కూడా పోలీసులు బలగాలను దింపారు. అందులో భాగంగా మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై పిల్లరు నెంబరు 174 వద్ద ఉప్పర్‌పల్లి సమీపంలో ఓ భవనంలో శ్రీధర్‌ బందోబస్తు విధుల్లో ఉన్నాడు. అయితే గురువారం తను రిపోర్ట్ చేసి శుక్ర , శని వారాల్లో అంటే రెండు రోజలు నుండి తను విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రాత్రి పదకొండు గంటలు సమయంలో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మ హత్య ప్రేమ కారనం అని పోలీసులు అంటున్నా పై అదికారుల ఒత్తిడి కారనం తేలిసి కూడా ఈ విషయాన్ని బైటికి రాకుండా చూశరానే ఆరోపణ‌లు వస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్‌ఐ రమేశ్‌ ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసు కున్నాడు. పెద్దపల్లికి చెందిన జగన్మోహన్‌ ఉన్నతాధికారుల ఒత్తిళ్లు భరించలేక సూసైడ్‌ చేసు కున్నాడు.ఆదిలాబాద్‌లో ఎస్‌ఐ కాజుద్దీన్‌ డ్యూటీలో చేరి కొద్ది రోజలు గడువక ముందే ఆత్మ హత్యకు ఒడిగట్టాడు. ఇందుకు కారణం ప్రేమ వ్యవహారమేనని ప్రచారం జరిగింది. ఇలా పోలీసు శాఖలో పని చేస్తున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు ఆత్మహత్యలకు పాల్పడటం, ఇలాంటి వరుస సంఘటనలతో పోలీస్‌ వ్యవస్థపై సామాన్య, మధ్య తరగతి ప్రజలకు గౌరవం లేకుండా పోయే అవకాశం కనిపిస్తున్నది. ఈ సంఘటనలన్నీ విధి నిర్వహణలో ఉన్న ఎస్సైలు తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నవే. కావడంతో ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొండి .. ఇలా వరుసగా ఆత్మ హత్యలు పోలీసుల్లో మనో దైర్యాన్ని కో ల్పోయేలా చేస్తుంది అని …. ఉన్నతాధికారుల వేదింపులు వసూల్ల చేయకపోయిన నెలవారీ మామూల్లు సమయానికి రాకపోయిన ఉన్నతాధికారులు వేధిస్తారని ఇప్పుడూ డ్యూటీ లో ఉన్న ఎస్సైలు ఒప్పుకుంటున్నా…. నిజాలు చెప్పలేని పరిస్థితి . వీరు ఒత్తిడికి గురౌతున్న ఎస్సైలను ముందుగానే గుర్తించి … ఎలాంటి విషయాలను అయినా స్వచ్చందంగా చెప్పుకునే స్వేచ్చ ఇవ్వాలని కోరుతున్నారు ..
ప్రభుత్వం కూడా ఈ ఆరుగురు ఎసైల పై దర్యప్తు చేసి ..మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా … ఉన్నతాధికారుల పర్యవేక్షన… ఎప్పటికప్పుడు డిజిపి సమీక్ష జరిపి .. పని ఒత్తిడి ఎప్పుడూ ఉండేదే కాని మాఫియా పై అధికారుల ఒత్తిడిపై ఎప్పటికప్పుడు ఇంట‌లిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొంటే ఇలాంటివి పురావృతం కావ‌ని మాజీ పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow