టోక్యో ఓలంపిక్స్ లో పథకాలే లక్ష్యంగా క్రీడాకారుల‌ను స‌న్న‌ద్దం చేయాలి

Spread the love

ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆదేశాల మేరకు దేశంలో క్రీడల ఆభ్యున్నతి కోరతు క్రీడాకారులను గుర్తించి టోక్యో ఓలంపిక్స్ లో పథాకాలు సాదించటమే లక్ష్యంగా ప్రత్యేక సదస్సు ను తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ బేగంపేట లోని పర్యాటక భవన్ లో నిర్వహించింది. ఈ టాస్క్ ఫోర్స్ సదస్సు ను తెలంగాణ టూరిజం మరియు క్రీడా శాఖ కార్యదర్శి బుర్ర వేంకటేశం ప్రారంబించారు. ఆనంతరం మట్లాడుతూ రియో ఓలంపిక్స్ లో మన దేశం అనుకున్నంత పథకాలు సాదించలేక పోయమని, వచ్చే ఓలంపిక్స్ లో మరిన్ని పథకాలు సాదించటమే లక్ష్యంగా క్రీడాకారుల సన్నదం చేయాలని క్రీడాసంఘాలను స్పోర్ట్స్ సేక్రటరీ బుర్ర వేంకటేశం ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడల ఆభ్యున్నతికి క్రీడా ప్రాంగాణాల ప్రాముఖ్యతను వివరించారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆందుకు ఉదహరణగా ఓలంపిక్ పథకం సాదించిన పి వి సిందు కు సిఎం కెసిఆర్ వరాల జల్లు కురిపించారని గుర్తు చేసారు . రాష్ట్రంలో క్రీడాకారులకు తగిన మౌళిక వసుతులను కల్సిస్తుందన్నారు. ఇప్పటికే నగరంలో పలు ఆంతర్జీతీయ స్థాయి క్రీడా ప్రాంగాణాలు ఉన్నాయన్నారు. క్రీడా ప్రాంగాణాలు క్రీడా కారులు ఉపయేగించుకోని ఆంతర్జాతీయ స్థాయి ఎదుగేందుకు ఆవసరమైన కోచ్ లను సమకూర్చామన్నారు. వచ్చే ఓలంపిక్ వేదికైన టోక్యో లో పథకాలే లక్ష్యంగా క్రీడాకారులను తయారు చేస్తున్నట్లు ప్రకటించారు క్రీడా శాఖ కార్యదర్శి బుర్ర వేంకటేశం . ప్రధానమంత్రి నరేంద్ర మేడి లక్ష్యసాధనకు తెలంగాణ క్రీడా శాఖ తమ వంతు కర్తవ్వాన్ని నిర్వహిస్తామన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆదేశాల మేరకు ఓలంపిక్ టాక్క్ ఫోర్స్ కమీటి సభ్యులు ఓమ్ ప్రకాష్ , బల్దేవ్ సింగ్ , రాజేష్ కార్ల, పుల్లేల గోపిచంద్ లు ఈ సధస్సులో పాల్గోన్నారు. వచ్చే 2020 , 2024,2028 ఓలంపిక్స్ లలో మరిన్ని క్రీడా పథకాలు సాదించిందేకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆంశంపై స్పోర్ట్స్ స్టాక్ హోల్డర్స్ తో టాస్క్ పోర్స్ కమీటి సమావేశమైంది. ఈ సధస్సు కు హాజరైన దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన తెలంగాణ , ఆంద్ర ప్రదేశ్ , కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడా శాఖ ఆధికారులు, క్రీడా ప్రాదీకార సంస్థల ఆథికారులు, గత ఓలంపిక్ విజేతైన కరణం మల్లీశ్వరీ, గుత్తా జ్వాలా, క్రీడా సంఘాల తో పాటు సధస్సుకు హజరైన క్రీడా స్టాక్ హోల్డర్స్ నుండి ఆభిప్రాయాలను, సూచనలను టాస్క్ ఫోర్స్ కమీటి స్వీకరించింది. ఈ టాస్క్ ఫోర్స్ సదస్సులో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ స్పేషల్ చీప్ సేక్రటరీ ఎల్ వి సుబ్రమణ్యం, రాష్ట్ర క్రీడా కార్యదర్శుల తో పాటు , సాట్స్ చైర్మన్ వేంకటేశ్వర రెడ్డి , సాట్స్ ఎండి దినకర్ బాబు తో పాటు , క్రీడా ప్రాదీకర సంస్థల ఆధికారులు ,గత ఓలంపిక్స్ లలో పథకాలు సాధించిన క్రీడాకారులు కరణం మల్లీశ్వరీ పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow