ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన చైనా స్టేట్ కౌన్సిల‌ర్ మ‌రియు ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ శ్రీ వెయ్‌ ఫెంఘే

Spread the love

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన చైనా స్టేట్ కౌన్సిల‌ర్ మ‌రియు ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ శ్రీ వెయ్‌ ఫెంఘే

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో చైనా స్టేట్ కౌన్సిల‌ర్ మ‌రియు ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ శ్రీ వెయ్‌ ఫెంఘే ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు.

భార‌త‌దేశానికి, చైనా కు మ‌ధ్య ర‌క్ష‌ణ ఇంకా సైన్య సంబంధ ఆదాన ప్ర‌దానాల రంగాలు స‌హా మిగిలిన అన్ని రంగాల‌ లోను ఉన్న‌త స్థాయి సంబంధాలు వేగాన్ని పుంజుకోవ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ప్ర‌శంస‌లు కురిపించారు.

భార‌త‌దేశం-చైనా సంబంధాలు ప్ర‌పంచం లో స్థిర‌త్వానికి ఒక కార‌ణ‌మ‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొంటూ, స‌రిహ‌ద్దు ప్రాంతాల లో శాంతి ఇంకా ప్ర‌శాంత‌త‌ లు భార‌త‌దేశం, చైనా లు వాటి మ‌ధ్య ఉన్న అభిప్రాయ బేధాలను ప‌రిష్కరించుకోవ‌డం లో అవ‌లంభించే సున్నిత‌త్వాన్ని, ప‌రిణ‌తిని సూచిస్తున్నాయ‌ని, ఆ అభిప్రాయ బేధాల‌ను వివాదాలుగా మార‌నివ్వ‌డం లేద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

వూహాన్, కింగ్ డావో ఇంకా జోహానిస్ బర్గ్ ల‌లో అధ్య‌క్షులు శ్రీ శీ జిన్ పింగ్ తో తాను ఇటీవ‌ల జ‌రిపిన భేటీ ల‌ను కూడా ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ఆప్యాయంగా గుర్తుకు తెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*