3వేల మంది చే హ‌రిత‌హారం నిర్వ‌హించిన మేయ‌ర్ రామ్మోహ‌న్‌

Spread the love

3వేల మంది చే హ‌రిత‌హారం నిర్వ‌హించిన మేయ‌ర్ రామ్మోహ‌న్‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని కాప్రాలో నేడు రికార్డు స్థాయిలో 3వేల మంది హ‌రిత‌హారం వాలెంటీర్ల‌తో క‌లిసి న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ మొక్క‌ల‌ను నాటారు. రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ సునితామహేంద‌ర్‌రెడ్డి, ఎన్‌.బి.సి ఛైర్మ‌న్ శ్రీ‌నివాస్‌, ఎంపీ మ‌ల్లారెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ ధ‌ర్మారెడ్డి, జోన‌ల్ క‌మిష‌న‌ర్ గంగాధ‌ర్‌రెడ్డిలు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా కాప్రా స‌ర్కిల్ కార్యాల‌యం నుండి జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ వ‌ర‌కు విద్యార్థులు, మ‌హిళ‌లు, యువ‌జ‌న సంఘాల కార్య‌క‌ర్త‌ల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 250కోట్ల మొక్క‌ల‌ను నాటాల‌న్న ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ల‌క్ష్యంలో జీహెచ్ఎంసీ కూడా భాగ‌స్వామ్యం అవుతోంద‌ని పేర్కొన్నారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ ప‌రిధిలో కోటి మొక్క‌ల‌ను నాటనున్న‌ట్టు తెలియ‌జేశారు. అప‌ర భ‌గీర‌థుడ‌ని కేవ‌లం పుర‌ణాల్లోనే చ‌దివామ‌న్ని, కానీ ప్ర‌స్తుతం ఆ అప‌ర భ‌గీర‌థుడిగా కేసీఆర్‌ను చూస్తున్నామ‌ని అన్నారు. విదేశాల్లో ఒక్కో వ్య‌క్తికి సుమారు ప‌ది చెట్లు ఉండ‌గా భార‌త దేశంలో ఒక చెట్టు కూడా స‌గ‌టునలేద‌ని, త‌ద్వారా ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తులు ఎద‌ర‌వుతున్నాయ‌ని అన్నారు. మొక్క‌ల‌ను ప్ర‌తిఒక్క‌రూ క‌నీసం ప‌ది మొక్క‌ల‌ను నాటాల‌ని, త‌ద్వారా హ‌రిత తెలంగాణ‌గా మార్చాల‌ని పిలుపునిచ్చారు. మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స‌భ్యులు మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చ‌ల్ జిల్లాలో 30ల‌క్షల జ‌నాభా ఉండ‌గా 40ల‌క్ష‌ల మొక్క‌ల‌ను హ‌రిత‌హారంలో నాటాల‌నే ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపారు. ఈ మొక్క‌ల‌ను నాట‌డంతో పాటు వాటి ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తిఒక్క‌రూ న‌డుం బిగించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తాము నాటిన చెట్ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌రిర‌క్షిస్తామ‌ని ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నవారితో ప్ర‌తిజ్ఞ చేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow