‘ఒక్కడు మిగిలాడు’ నా చివరి చిత్రం…మనోజ్ కుమార్

Spread the love

‘ఒక్కడు మిగిలాడు’ నా చివరి చిత్రం…మనోజ్ కుమార్

మంచు మనోజ్ కుమార్, తాజాగా ఒక షాకింగ్‌ ప్రకటన చేశాడు. తను ప్రస్తుతం నటిస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రమే తనకు చివరి చిత్రమని, ఇకపై తాను నటించబోనని ప్రకటించాడు. మనోజ్‌ ప్రకటించిన ఈ నిర్ణయం తెలుగు సినిమా ప్రముఖుల్లో పలు చర్చలకు దారితీసింది. కలెక్షన్‌ కింగ్‌ డా. మంచు మోహన్ బాబు వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్ కుమార్, వైవిధ్యభరిత చిత్రాలతో తన నటనతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం, అడవిలో అన్న, ఖైదీగారు వంటి చిత్రాలలో బాలనటుడి నటించిన మనోజ్‌, 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు. బిందాస్ సినిమాకుగానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు. రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, ఊ..కొడతారా ఉలిక్కిపడతారా వంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించిన మనోజ్, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో మాత్రం వెల్లడించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow