వ్య‌వ‌సాయ‌… రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు

Spread the love

రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్దికి, రైతు సమస్యల పరిష్కారానికి తీసుకొవాల్సిన చర్యలపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఈ రోజు సమావేశమయ్యారు. ఈరోజు హైదరాబాద్ లోని ఆదర్శ్ నగర్ ESIA రీజనల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి గారు మాట్లాడుతూ వ్యవసాయ రంగం సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తరుపున దత్తాత్రేయ గారు చొరవ తీసుకోని సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ది కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి బారీగా నిధులను ఖర్చు చేస్తున్నదని తెలిపారు. అయితే కేంద్రం కూడా ఉదారంగా నిధులను కెటాయించినట్లయితే రైతులు ఆర్దికంగా అభివృద్ది చెందుతారని, 2022 నాటికి రైతుల ఆధాయం రెట్టింపు చేయాలనే కేంద్ర లక్ష్యం నెరవేరుతుందని మంత్రి గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన పరిదిలోని అంశాలలో బారీగా నిధులను కెటాయిస్తున్నా, కొన్ని అంశాలు కేంద్ర పరిదిలో ఉండటంతో అమలుచేయలేకపోతున్నామని మంత్రి పోచారం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.


ముఖ్యంగా కనీస మద్దతు ధర అంశంలో స్వామినాధన్ సిఫారసులను దశలవారిగా అమలు చేయాలని కోరారు. రాబడితో చూసుకుంటే పెట్టుబడులు బారీగా పెరిగాయి కావున మద్దతు ధరను బారీగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అదే విదంగా సేద్యంలో ఖర్చులు తగ్గించడానికి రాష్ర్ట ప్రభుత్వం యాంత్రీకరణను బారీగా ప్రోత్సహిస్తుందని దీని కోసం ప్రత్యేకంగా నిధులను కెటాయించాలని మంత్రి గారు కోరారు. అదే విదంగా రైతులు సేద్యం ఖర్చులు తగ్గించుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాది హామి పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసందానించాలని కోరారు. ఉన్నత విద్యావంతులు పాలీహజ్ ల రంగంలోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 1000 ఏకరాలలో పాలీహౌజ్ లను నిర్మించాం మరో 3000 ఏకరాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. మారుతున్న పరిస్థితులలో అనేక మంది ఆదర్శ రైతులు సేంద్రీయ సాగు వైపు ఆసక్తి చూపుతున్నారని, పరంపరాగత కృషి వికాస యోజన స్కీం ద్వారా వారికి మరిన్ని ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.
నకిలీ విత్తనాలను నిరోదించేందుకు సీడ్ యాక్ట్ ను తీసుకురావాలని మంత్రి గారు కోరారు. ఈ బిల్లు చాలా రోజులుగా పెండింగ్ లో ఉండటంతో నకిలీ విత్తనాల కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నామని మంత్రి గారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విదంగా తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తికి అత్యంత అనుకూలంగా ఉండటంతో సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ పథకానికి అవసరమైన సహకారాలను అందించాలని మంత్రి గారు విన్నవించారు.

ప్రభుత్వానికి బారమైనా రైతుల శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకోని రుణ మాఫి చేశాం, అయితే కొన్ని బ్యాంకులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఈ విషయంలో కలుగజేసుకోని సమస్యను పరిష్కరించాలని మంత్రి గారు కోరారు. పంటల సాగుకు అత్యంత ముఖ్యమైన భూసార పరీక్షల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత నిస్తుంది. ఇప్పటికే ప్రతి రెండు వేల హెక్టార్లకు ఒక AEO ని నియమించాం. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పరిదిలో ఓక మిని భూసార పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పి ప్రతి రైతు పొలంలో విదిగా భూసార పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రాధామోహన్ సింగ్ ను కలిసినప్పుడు 2000 మిని భూసార పరీక్ష కేంద్రాలకు అనుమతించారు. ఇప్పటి వరకు 650 ల్యాబ్ ల ఏర్పాటుకు నిధులు విడుదలయ్యాయి పనులు కొనసాగుతున్నాయి. మిగితా 1450 ల్యాబ్ ల నిధులను కూడా త్వరగా విడుదల చేయించాలని మంత్రి గారు కోరారు.
ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయో రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మంచి పథకం, అయితే ఇందులోని కొన్ని నిబందనలను సవరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున నివేదిక పంపామని ముఖ్యంగా రైతునే యూనిట్ గా తీసుకునే అంశం ప్రవేశపెట్టాలని మంత్రి గారు కోరారు. అదే విదంగా రాష్ట్రంలో కూరగాయాలు, పండ్ల నిల్వ కోసం 10 ప్రాంతాలలో శీతల గిడ్డంగుల నిర్మాణం కోసం అపెడా ద్వారా నిధుల కోసం ప్రతిపాధనలు పంపామని త్వరగా వాటిని విడుదల చేయాలని మంత్రి గారు కోరారు.
రాష్ట్రంలో వాణిజ్య పంటలు బారీ ఎత్తున సాగవుతున్నాయి. ముఖ్యంగా మిర్చి, పసుపు ను రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని అయితే వాణిజ్య పంటలు కావడంతో వీటికి కనీస మద్దతు ధర కేంద్రం ప్రకటించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని మంత్రి గారు తెలిపారు. ఈ ఏడాది మిర్చికి ధర బారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఈ విషయంలో కలుగజేసుకోవాలని మంత్రిగారు కోరారు. మార్కెట్ ఇంటర్వేన్ ఫండ్ ద్వారా నిధులను కెటాయిస్తే నాఫెడ్ లేదా ఇతర సంస్థల ద్వారా క్వింటాలుకు రూ.7000 చొప్పున మిర్చిని కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖకు ప్రతిపాధనలు పంపాం త్వరగా అనుమతించాలని మంత్రి గారు కొరారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రతిపాధనలు, నివేదిక పట్ల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సంతృప్తి వ్యక్తం చేశారు. తాను కేంద్ర మంత్రులతో మాట్లాడి అవసరమైన నిధులు, అనుమతులను త్వరితంగా ఇప్పించేందుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్దసారది, కమీషనర్ జగన్మోహన్, ఉధ్యాన శాఖ కమీషనర్ L. వెంకట్రామి రెడ్డి, నాబార్డు CGM , మార్క్ ఫెడ్, నాఫెడ్, FCI అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow