మోసం చేసిన యువకుడితోనే యువతి పెళ్లి

Spread the love
  • యువతిపేర మూడు ఎకరాల భూమి
  • యువతి తండ్రి ఆత్మహత్యతో మలుపు తిరిగిన ఘటన
  • పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తున్న గ్రామస్తులు,ఎసిపి
  • నుండి పత్రాలు తీసుకుంటున్న యువతి

గీసుకొండ(వరంగల్‌) : ప్రేమించి మోసం చేసిన యువకుడి మోసం వల్ల మనస్థాపంతో యువతి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించగా మరో మలుపు తిరిగింది. ప్రేమించిన యువకుడితోనే యువతి పెళ్లికి ఒప్పందం కుదిరింది. గీసుకొండ మండల కేంద్రానికి చెందిన కందికొండ గట్టయ్య అనే వ్యక్తి తన కూతరును ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో దానిని అవమానభారంగా బావించి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన మండల కేంద్రంలో ఉద్రిక్తతకు దారి తీసింది. దీనిపై మృతుడి బంధువులు, గ్రామస్థులు శనివారం ఉదయం గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

మోసం చేసిన దిడ్డి ప్రశాంత్‌ అనే యువకుడితోనే గట్టయ్య కూతురు మాధవి పెళ్లి జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. లేదంటే గట్టయ్య మృతదేహాన్ని యువకుడి ఇంటి వద్ద వేస్తామని పోలీసులతో గొడవకు దిగారు. దీనిపై మామునూరు ఏసీపీ శోభన్‌ కుమార్‌ ఆందోళన చేయవద్దని, భాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని వారికి నచ్చజెప్పారు. దీనితో గట్టయ్య బంధువులు, మోసం చేసిన యువకుడి తండ్రి రాజయ్య పోలీస్‌ స్టేషన్‌ వెలుపల మాట్లాడుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు. గట్టయ్య కూతురును మోసం చేసిన కేసులో రిమాండ్‌పై జైలులో ఉన్న దిడ్డి ప్రశాంత్‌ను తీసుకొని వచ్చి జూలై 5న మాధవితో వివాహాం జరిపిస్తామని హామీ ఇవ్వడమే కాక అతనికి ఉన్న 5 ఎకరాల భూమిలో మూడు ఎకరాలను మాధవి పేర మార్పిడి చేయిస్తామని స్టాంపు పేపర్‌పై రాజయ్య రాసి ఇవ్వడంతో భాదితులు తమ ఆందోళనను విరమించారు. ఈ ఘటనలో ఏసీపీ శోభన్‌ కుమార్‌తో పాటు పర్వతగిరి సీఐ సత్యనారాయణ, గీసుకొండ, సంగెం ఎస్సైలు రామకృష్ణ, నవీన్‌ కుమార్‌, దీపక్‌లు గొడవ జరగకుండా భాదిత కుటుంబాన్ని శాంతింపజేసారు. కాగా ఈ ఘటనలో మోసం చేసిన దిడ్డి ప్రశాంత్‌ గతంలో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి పట్టించుకోక పోవడంతో దానికి పంచాయితీ జరుపగా వీరగోని రాజ్‌కుమార్‌ అనే పెద్ద మనిషి పట్టించుకోకపోవడం వల్లనే యువతి తండ్రి ఆత్మహత్యకు కారణమయ్యిందని రాజ్‌కుమార్‌పై భాదిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow